మిస్టర్ మజ్ను తొలి పాట.. 'ఏమిటో ఏమిటో' అంటూ అఖిల్ ప్రేమ రాగాలు!
అక్కినేని యువ వారసుడు అఖిల్ నటిస్తున్న తాజా చిత్రం మిస్టర్ మజ్ను. తొలిప్రేమ ఫేమ్ వెంకీ అట్లూరి దర్శత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.అఖిల్ ఈ చిత్రంలో లవర్ బాయ్ గా కనిపిస్తున్నాడు. రొమాంటిక్ ప్రేమకథగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. నిధి అగర్వాల్ నిఖిల్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్ర ప్రచార కార్యక్రమాలు షురూ అయ్యాయి.
తాజాగా ఈ చిత్రంలోని తొలిపాటని లిరికల్ వీడియో రూపంలో విడుదుల చేశారు. ఏమిటో ఏమిటో అంటూ సాగే ఈ పాట ఆకట్టుకుంటోంది. లవ్ ట్రాజిడీ సాంగ్ ని తలపించేలా ఈ పాట ఉంది. హీరో, హీరోయిన్ మధ్య ఎడబాటును వివరిస్తూ పాటల రచయిత శ్రీమణి సాహిత్యాన్ని అందించారు. సంగీత దర్శకుడు తమన్ అందించిన ట్యూన్ వినసొంపుగా ఉంది. అర్మాన్ మాలిక్ ఈ పాటని పాడారు.

ఇక మిస్టర్ మజ్ను చిత్రం జనవరి 25 న విడుదల కానుంది. కొద్దిరోజుల క్రితమే విడుదల తేదీని అఖిల్ ఖరారు చేశాడు. అఖిల్ నటించిన తొలి రెండు చిత్రాలు నిరాశపరిచాయి. మూడో చిత్రంగా వస్తున్న మిస్టర్ మజ్ను చిత్రం అఖిల్ కెరీర్ కు చాలా కీలకం. హిట్ దర్శకుడి నుంచి వస్తున్న చిత్రం కావడంతో మిస్టర్ మజ్నుపై మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి.


Click it and Unblock the Notifications











