ఎన్టీఆర్, జాన్వీని మరిపించిన ఫారెన్ జంట.. వీడియో చూసి షాక్‌లో నందమూరి ఫ్యాన్స్
యాక్టింగ్, డ్యాన్స్, డైలాగ్ డెలివరీ, ఫైట్స్, సింగింగ్ ఇలా ఎన్నో విధాలుగా ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్ ఆల్‌రౌండర్‌గా, స్టార్ హీరోగా దూసుకెళ్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్. దీనికితోడు ఈ మధ్య కాలంలో వరుసగా హిట్లు మీద హిట్లు కొడుతూ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఇలా ఇప్పుడు ఎన్టీఆర్ 'దేవర' అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ అభిమానులే షాకయ్యే ఓ వీడియో సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఇంకెందుకు ఆలస్యం దానిపై మీరూ ఓ లుక్కేయండి మరి!
ఎన్టీఆర్ కొంత కాలంగా వరుసగా విజయాలను అందుకుంటూ ఫుల్ ఫామ్‌తో దూసుకుపోతోన్నాడు. ఈ జోష్‌లోనే ఇప్పుడు 'దేవర' అనే సినిమాను చేస్తున్నాడు. కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ఈ మూవీ ఫుల్ లెంగ్త్ యాక్షన్‌తో కోస్టల్ బ్యాగ్‌డ్రాప్‌తో రాబోతుంది. దీంతో దీనిపై అంచనాలు భారీగా ఏర్పడడంతో చిత్ర యూనిట్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా దీన్ని రూపొందిస్తోంది.

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్ - కొరటాల కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న 'దేవర' మూవీకి సంబంధించిన షూటింగ్ లాస్ట్ ఇయర్‌లోనే ప్రారంభం అయింది. అప్పటి నుంచి అస్సలు బ్రేకులు లేకుండా చిత్రీకరణను జరుపుతున్నారు. ఇలా ఇప్పటికే 85 శాతం కంటే ఎక్కువగానే టాకీ పార్టును పూర్తి చేశారు. మిగిలిన దాన్ని కూడా త్వరగానే కంప్లీట్ చేసేలా చూస్తున్నారు.
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తోన్న 'దేవర' మూవీ మొదటి భాగాన్ని సెప్టెంబర్ 27వ తేదీన విడుదల చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ మూవీ నుంచి ఇప్పటికే ఫియర్ సాంగ్ వచ్చింది. ఈ క్రమంలోనే ఇటీవలే 'చుట్టమల్లే' పాట కూడా వచ్చింది. దీనికి భారీ స్థాయిలో స్పందన లభించింది. ఫలితంగా ఈ సాంగ్ సూపర్ డూపర్ హిట్ అయిపోయింది.
'దేవర' చిత్రం నుంచి విడుదలైన 'చుట్టమల్లే' సాంగ్‌కు ఎంతో మంది రీల్స్ కూడా చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ ఫారెన్ కపుల్ బీచ్‌లో ఈ పాటకు డ్యాన్స్ చేశారు. ఇందులో వీళ్లిద్దరూ ఎన్టీఆర్, జాన్వీ కపూర్‌ను మరిపించేలా సేమ్ స్టెప్పులు వేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇది చూసిన నందమూరి ఫ్యాన్స్ మాత్రం షాక్ అయిపోతున్నారు.
ఇదిలా ఉండగా.. పవర్‌ఫుల్ యాక్షన్‌తో తెరకెక్కుతోన్న 'దేవర' మూవీని నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దీనికి యంగ్ సెన్సేషన్ అనిరుథ్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో జాన్వీ హీరోయిన్ కాగా.. సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటిస్తున్నాడు. ఇందులో శ్రీకాంత్, చాకో సహా తదితరులు నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











