తలపాగా చుట్టిన మహర్షి.. 'పదరా పదరా' అంటూ రైతులతో!
సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న తాజా చిత్రం మహర్షి. మహర్షి మహేష్ బాబు 25వ చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. వంశీ పైడిపల్లి దర్శత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. అశ్విని దత్, దిల్ రాజు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పూజ హెగ్డే మహేష్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. భరత్ అనే నేను తర్వాత మహేష్ నటిస్తున్న మరో సందేశాత్మక చిత్రం ఇది. మే 9న మహర్షి చిత్రం విడుదల కానుండడంతో చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాల వేగం పెంచుతోంది.
ఇప్పటికే విడుదలైన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. వరుసగా పాటలు కూడా విడుదల చేస్తున్నారు. ఎవరెస్టు అంచున అనే వీడియో సాంగ్ లో మహేష్, పూజ హెగ్డే అదరగొట్టారు. ఈ చిత్రంలోని నాల్గవ సాంగ్ ని విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధం అయింది. వంశీ పైడిపల్లి ట్విట్టర్ లో ఈ విషయాన్ని ప్రకటించారు. శ్రీమణి సాహిత్యం అందించిన 'పదరా పదరా' అంటూ సాగే పాటని ఏప్రిల్ 24 సాయంత్రం 4:05 గంటలకు విడుదల చేయనున్నట్లు దర్శకుడు వంశీ పైడిపల్లి ప్రకటించారు.

ఈ సంధర్భంగా విడుదల చేసిన పోస్టర్ లో మహేష్ లుక్ చాలా బావుంది. మహేష్ బాబు తలపాగా చుట్టి రైతులతో ముందుకు సాగుతున్న పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచే విధంగా ఉంది. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











