'గగన వీధిలో' అంటూ రాబోతున్న మెగా హీరో.. డేట్, టైమ్ ఫిక్స్
హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న కొత్త సినిమా 'వాల్మీకి'. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. తమిళ నటుడు అథర్వా మురళి విలన్‌గా కనిపించనున్నాడు. 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మించారు. తమిళంలో విజయవంతమైన 'జిగర్తాండ' సినిమాకి రీమేక్ గా వాల్మీకి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా సెప్టెంబర్ 20వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు వేగవంతం చేశారు యూనిట్ సభ్యులు. ఇందులో భాగంగా చిత్రంలోని సెకండ్ లిరికల్ సాంగ్ 'గగన వీధిలో'ని సెప్టెంబర్ 5వ తేదీన సాయంత్రం 5 గంటలకు విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు. పైగా మెలోడీగా సాగిపోయే ఈ సాంగ్ లో వనమాలీ అందించిన లిరిక్స్ పై మిక్కీ జె మేయర్ లిరిక్స్ అద్భుతంగా ఉంటాయని పేర్కొన్నారు.

ఇక 'వాల్మీకి' నుంచి ఇటీవలే విడుదలైన ''జర్రా.. జర్రా'' లిరికల్ వీడియో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో వరుణ్ తేజ్ డిఫరెంట్ లుక్ లో కనిపించనుండగా ఆయన సరసన పూజా హెగ్డే మరింత డిఫెరెన్ట్ రోల్ పోషించింది. ఇప్పటికే విడుదలైన అన్ని అప్‌డేట్స్ సినిమాపై అంచనాలు పెంచేయడంతో వాల్మీకి పట్ల మెగా అభిమానుల్లో ఆత్రుత నెలకొంది.


Click it and Unblock the Notifications











