ఫ్రోజెన్ మ్యూజిక్ గురించి లోపేజెస్.. ఆస్కార్‌ ప్రయాణానికి నా కూతుళ్లే స్ఫూర్తి

అద్భుతమైన కథనం, ఆకట్టుకొనే పాటల చిత్రీకరణ, కథను ముందుకు నడిపించే ఆసక్తికరమైన అంశాలతో మ్యూజికల్ ఫాంటసీ చిత్రంగా ఫ్రోజెన్ రూపొందింది. 2013లో రూపొందిన ఈ చిత్రం క్వీన్ ఎల్సా (గాయని ఇడినా మెంజెల్) పాడిన లెట్ ఇట్ గో పాటతో కథలోకి వెళ్తుంది. ఒంటరితనంలో కూడా తాను స్వేచ్ఛగా, సెక్యూర్‌గా ఉందని భావిస్తుంటుంది. తన ప్రపంచంలో తాను చుట్టూ కట్టుకొన్న మంచు కొండలను కరిగించేది ప్రేమతో కరిగించగలమని విశ్వసిస్తుంది.

లెట్ ఇట్ గో పాటతో ఎల్సా తనలోని ఫీలింగ్స్ బయట ప్రపంచానికి చెబుతూ.. తన వాస్తవ జీవితాన్ని ప్రేక్షకుల ముందు తొలిసారి ఆవిష్కరిస్తుంది. మూవీలో చోటు చేసుకొనే ప్రతీ మార్పు ఎల్సాలోని మార్పులను సూచించేలా ఉంటుంది. తాజా సీక్వెల్‌లో కూడా ఇదే తరహా కథనం సాగుతుంది. ఇంటూ ది అన్‌నోన్ పాటతో కథ ముందుకు వెళ్తుంది. ఓ అదృశ్య రూపం సైగలు, మాటలతో తనలో ఉన్న ప్రశ్నలకు సమాధానం కోసం వెతికే ప్రక్రియ మొదలవుతుంది.

Frozen Music: Lopezes shares Oscar moments for Let It Go song

ఫ్రోజెన్ 2 సినిమా కోసం రచయితలు క్రిస్టెన్ అండర్సన్ లోపేజ్, రాబర్ట్ లోపేజ్ రంగంలోకి దిగి 7 సరికొత్త ఒరిజినల్ పాటలను రూపొందించారు. వాటిలో ఎమోషన్స్ నింపి, వినోదాన్ని జొప్పించి అద్భుతంగా స్వరపరిచేందకు కారణమయ్యారు. తన తొలి చిత్రానికి స్ఫూర్తిగా నిలిచిన తన కూతుళ్లకు మ్యూజిక్ డైరెక్టర్ లోపేజెస్ క్రెడిట్ ఇచ్చారు.

లోపేజెస్ మాట్లాడుతూ.. సిస్టర్స్ అన్నా, ఎల్సా మాదిరిగానే నా కూతుళ్లు పెరిగినట్టు కనిపిస్తారు. జీవితంలో నా పిల్లలు స్వతంత్రంగా వ్యవహరిస్తూ మా నుంచి ఎలాంటి సపోర్ట్ లేకుండా వారికి ఎదురయ్యే సమస్యలను పరిష్కరించుకొంటారు. మా అమ్మాయిల తీరు చూస్తే తల్లిదండ్రులగా మాకు ఎంతో గర్వంగా ఉంటుంది. నా కూతుళ్ల జీవన ప్రయాణం సినిమాకు స్ఫూర్తిగా నిలిచాయి. ఎల్సా, అన్నా కోసం తల్లి పాడే లాలిపాట 'ఆల్ ఈజ్ ఫౌండ్' సినిమాకు ప్రాణంగా నిలిచింది. దానిని అద్బుతమైన సాహస కార్యంగానే కాకుండా కథకు రోడ్‌మ్యాప్ వేసింది. అని అన్నారు.

2013లో ఆస్కార్ అవార్డుల ప్రధానంలో ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో లెట్ ఇట్ గో అనే పాట లోపెజెస్‌కు అత్యుత్తమ మ్యూజిక్ అవార్డును అందించింది. ఈ సౌండ్ ట్రాక్‌ను డిస్నీ అందించిన విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X