మ్యూజిక్ డైరెక్టర్‌పై శివమెత్తిన అనంత శ్రీరామ్.. హిందు మతాన్ని కించపరిచాడంటూ..!
ఇప్పుడు తెలుగు చలన చిత్ర పరిశ్రమ పేరుని యువ దర్శకులు సహా దిగ్గజ దర్శకులు ఏ రేంజ్ లోకి తీసుకెళ్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కాగా ఈ సినిమాల్లో జానర్ ఏదైనా భారీ వసూళ్లు సాలిడ్ కంటెంట్ తో తెలుగు సినిమా ఇపుడు ఇండియన్ సినిమా దగ్గర కింగ్ గా నిలిచింది. అయితే ఈ సినిమాల్లో మన చూసుకున్నట్టయితే దాదాపు మైథలాజి సినిమాలే లేదా ఆ టచ్ ఉన్న సినిమాలు కనిపిస్తాయి.
ఎక్కడ వరకో ఎందుకు గత ఏడాది లోనే పలు సినిమాలు తెలుగు నుంచి మైథలాజి బ్యాక్ డ్రాప్ లో వచ్చి భారీ వసూళ్లు సాధించి ఎంతగానో అలరించాయి. కాగా భారత దేశం అంటేనే హైందవత్వానికి పెట్టింది పేరు. మన చరిత్ర, పురాణాలు, ఇతిహాసాలు కోసం భావి తారలు తెలుసుకోవాలని రామాయణ, మహాభారతం లాంటి వాటి విషయాల్లో ఇప్పటికీ అనేకమంది ఎంతో గర్వంగా ఫీలయ్యే వారు ఉన్నారు.

కాగా ఈ నేపథ్యంలో వచ్చిన చిత్రాల్లో ఇండియాస్ బిగ్గెస్ట్ గ్రాసర్ లలో ఒకటిగా నిలిచిన చిత్రాల్లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన చిత్రం "కల్కి 2898 ఎడి" కూడా ఒకటి. కాగా ఈ చిత్రంలో ప్రభాస్ భైరవ అలాగే కర్ణ అనే పవర్ఫుల్ పాత్రల్లో నటించిన సంగతి తెలిసిందే. కాగా క్లైమాక్స్ లో రివీల్ చేసిన కర్ణ పాత్ర థియేటర్స్ లో బ్లాస్ట్ అయ్యింది.
కానీ ఈ పాత్రని ఎలివేట్ చేయడంపై ముఖ్యంగా హైందవ ధర్మాన్ని పాటించే ప్రముఖులు అప్పట్లోనే అభ్యంతరం వ్యక్తం చేశారు. కర్ణుడిని హీరోలా చూపించారు కానీ కర్ణుడు అంత మంచివాడు అంటూ చాలానే షాకింగ్ కామెంట్స్ వినిపించాయి. కాగా ఇపుడు ఇదే కర్ణ పాత్రపై మన టాలీవుడ్ నుంచి కూడా మార్క్ తగిలింది. ప్రముఖ పాటల రచయిత రీసెంట్ గా గేమ్ ఛేంజర్ లో బ్లాస్టింగ్ సాంగ్ రా మచ్చ మచ్చ ఇచ్చిన సాహిత్య రచయిత అనంత్ శ్రీరామ్ చేసిన షాకింగ్ కామెంట్స్ ఇపుడు చర్చకి దారి తీశాయి.
కాగా తాను ఓ హైందవ ధర్మ మీటింగులో పాల్గొనగా కల్కి 2898 ఎడి సినిమాలో ప్రభాస్ పోషించిన కర్ణ పాత్రపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మన హైందవాన్ని సినిమాల్లో కూడా ఇష్టమొచ్చినట్టు మార్చి తీస్తున్నారు ఉదాహరణకి మొన్న కల్కి లో కర్ణ పాత్రని అలా చూపించడం తన పాత్రని వక్రీకరించడం చూసి హిందువుగా సిగ్గు పడుతున్నా అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.
- Kalki 2898 AD
— Aakashavaani (@TheAakashavaani) January 5, 2025
- Dum Maaro Dum Song
- PK
- Cosmic Sex
- Kaali Poster
- Akram Hussain
- A non-Hindu music director
- A non-Telugu music director
Lyricist #AnanthaSriram fires on filmmakers and artists who are manipulating the facts related to Hindu dharma. He calls for… pic.twitter.com/iaAgX4xvuS
దీంతో ఈ కామెంట్స్ ఇపుడు సంచలనంగా మారాయి. వీటితో పాటుగా ఓ సంగీత దర్శకునితో జరిగిన వివాదాన్ని కూడా తాను షేర్ చేసుకున్నారు. కాగా ఓ పాట సమయంలో "బ్రహ్మాండ నాయక" అనే పదం ఉంది ఆ సాంగ్ చెయ్యను అని చెప్పాడని దానికి బదులుగా తాను ఆ సంగీత దర్శకునికి తన జీవితంలో ఒక్క పాట కూడా రాసేది లేదు అంటూ శపధం చేశాను అని షాకింగ్ కామెంట్స్ చేశారు. దీనితో తనని హిందూ మతం విషయంలో అంతలా హర్ట్ చేసిన ఆ సంగీత దర్శకుడు ఎవరు అంటూ చర్చ మొదలైంది. కొన్ని పేర్లు కూడా వినిపిస్తున్నాయి కానీ అదెవరు అనేది ఇపుడు సస్పెన్స్ గానే మిగిలింది.


Click it and Unblock the Notifications











