రాంచరణ్‌ను కవ్విస్తుస్తున్న కియారా అద్వానీ.. రా మచా మచా అంటూ అందాల భామ
గేమ్ ఛేంజర్ అప్‌డేట్స్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్, సినీ లవర్స్ చిత్రం యూనిట్ మరో క్రేజీ అప్‌డేట్‌ను అందించారు. గ్లోబల్ స్టార్ రాంచరణ్, అందాల భామ కియారా అద్వానీ జంటగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ రూపొందిస్తున్న చిత్రం గేమ్ ఛేంజర్. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 22వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అవతున్నది. ఈ నేపథ్యంలో ప్రమోషనల్ కార్యక్రమంలో భాగంగా ఈ సినిమా పాటకు సంబంధించిన తాజాగా అభిమానుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఆ పాటకు సంబంధించిన ప్రోమో పోస్టర్ ఎలా ఉందో మీరే లుక్కేయండి..
గేమ్ ఛేంజర్ సినిమాలోని ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పాటలు, కంటెంట్‌కు మంచి స్పందన వస్తున్నది. ఇప్పటికే గేమ్ చేంజర్ నుంచి వచ్చిన జరగండి జరగండి.. పాట ఎంత సెన్సేషన్ అయ్యిందో అందరికీ తెలిసిందే. మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడూ అని ఎదురు చూస్తున్న మరో పాటను తాజాగా విడుదల చేశారు. రా మచా మచా అనే పాట గురించి అప్ డేట్ ఇచ్చారు.

రా మచా మచా అనే పాట పల్లవిలోని సాహిత్యం చూస్తుంటే.. మ్యూజికల్ సెన్సేషన్ తమన్ నుంచి సంగీత సారథ్యం వహిస్తోన్న ఈ మూవీ నుంచి పక్కా మాస్ బీట్ సాంగ్ ఆడియెన్స్‌ను అలరించబోతుందని అర్థమవుతుంది. ఈ పాటను ప్రముఖ గేయ రచయిత అనంత్ శ్రీరామ్ సాహిత్యం అందించారు. ఈ పాటకు థమన్ సంగీతం అందించగా.. రాంచరణ్, కియారా అద్వానీపై చిత్రీకరించారు. సెప్టెంబర్ 28న సినిమా నుంచి సెకండ్ సాంగ్ 'రా మచ్చా మచ్చా' ప్రోమో విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ తెలియజేశారు.
గేమ్ ఛేంజర్ సినిమాకు సంబంధించిన సెకండ్ సాంగ్‌కు సంబంధించిన అప్‌డేట్ ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రేక్షకుల్లోనూ సరికొత్త ఎనర్జీనిచ్చింది. వినయ విధేయ రామ చిత్రంలో జోడీగా మెప్పించిన రామ్ చరణ్, కియారా అద్వానీ.. గేమ్ ఛేంజర్‌లో అలరించటానికి రెడీ అయ్యారు. ఈ క్యూట్ పెయిర్ సందడిని సిల్వర్ స్క్రీన్‌పై చూడాలనే ఉత్సాహం అందరిలోనూ కనిపిస్తోంది.

సంచలన దర్శకుడు శంకర్ తన కెరీర్‌లో ఇంతకు ముందెన్నడూ లేని విధంగా గేమ్ ఛేంజర్‌ను రూపొందిస్తున్నారు. గేమ్ ఛేంజర్ సినిమాలోని పాటలను తన రేంజ్‌కు తగినట్టే విదేశాల్లో భారీ వ్యయంతో చిత్రీకరించారు. ప్రముఖ ఆడియో కంపెనీ సారేగమ ఈ సినిమా ఆడియో రైట్స్‌ను ఫ్యాన్సీ ప్రైజ్‌కి దక్కించుకుంది.


Click it and Unblock the Notifications











