Game On తాజ్ మహల్‌కు రెంట్ ఎంత? రిచీ రిచ్ పాట రొమాంటిక్‌గా..!
కంటెంట్ ప్రధానంగా వచ్చే చిత్రాలకు తెలుగు ప్రేక్షకులు ఆదరించడమే కాకుండా భారీగా కాసులు వర్షం కురిపిస్తున్నారు. మంచి కథ, కథనాలు ఉంటే.. చిన్న హీరోనా? పెద్ద హీరోనా? అనేది చూడకుండా సినిమాను హిట్ చేస్తున్నారు. అలాంటి విభిన్నమైన కథ, విలక్షమైన పాత్రలతో వస్తున్న చిత్రం గేమ్ ఆన్. ఈ చిత్రంలో గీత్ ఆనంద్, నేహా సోలంకి హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. కస్తూరి క్రియేషన్స్ ప్రొడక్షన్, గోల్డెన్ వింగ్ ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై దయానంద్ దర్శకత్వంలో రవి కస్తూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి రిచో రిచ్ అనే ఫస్ట్ లిరికల్ పాటను రిలీజ్ చేశారు. ఆ పాట ఎలా ఉందంటే...
దా చిన్న కూర్చో నీకో కథ చెపుతా
అనగనగా ఊళ్ళో కుర్ర కథ
బాధలన్నీ నిండి ఉన్న బుర్ర కథ
ఒక్కసారి మారిపోయే కథ మొత్తం
గడియారం వచ్చింది చేతికి
గేమ్ తెచ్చిపెట్టింది నెత్తికి
తాజ్ మహల్ ఎంతమ్మ రెంట్‌కి
క్యాస్ ఇచ్చి కొంటా నేను బుర్జ్ ను
అయ్యా నేను
రిచ్ రిచీ రిచీ రిచీ రిచ్..
ఈ పాటకు అసుర ఇచ్చిన లిరిక్స్ చాలా క్యాచీగా ఉన్నాయి. వైవిధ్యమైన వాయిస్ తో అసుర, రిక్కీ లు ఆలపించిన విధానం కొత్తగా ఉంది.

ఈ సందర్బంగా నిర్మాత రవి కస్తూరి మాట్లాడుతూ... గతంలో మేము విడుదల చేసిన గేమ్ ఆన్ టైటిల్, ఫస్ట్ లుక్‌కు మంచి స్పందన వచ్చింది. ఇటీవల హైదరాబాద్ ఫేమస్ నవాబ్ గ్యాంగ్ బ్యాండ్ ద్వారా మ్యూజిక్‌ను రిలీజ్ చేస్తున్నాం. టీజర్ చూసిన చాలా మంది ఫ్రెండ్స్, డిస్ట్రిబ్యూటర్స్ మమ్మల్ని ఈ సినిమా గురించి మరింత ఆసక్తిగా అడగడం జరిగింది. దీంతో ఈ సినిమాపై మాకు చాలా మంచి నమ్మకం వచ్చింది అని అన్నారు.
దర్శకుడు దయానంద్ మాట్లాడుతూ.. గేమ్ ఆన్ చిత్రం రొటీన్ సినిమాలకు భిన్నంగా ఉండే కథ. తెలుగులో ఇప్పుడు డిఫరెంట్ సినిమాలు రావడమే కాదు. సక్సెస్ కూడా అవుతున్నాయి. ఓ మార్క్ క్రియేట్ చేస్తున్నాయి. ఆ కోవలోనే గేమ్ ఆన్ సినిమా ఉంటుందని భావిస్తున్నాను. చాలా ట్విస్టులు ఉంటాయి. మేము చెప్పిన కథను నమ్మి సినిమా చెయ్యడానికి వచ్చిన నిర్మాతకు ధన్యవాదాలు అని అన్నారు,
నటీనటులు: గీతానంద్, నేహా సోలంకి, ఆదిత్య మీనన్, మధుబాల, వాసంతి, కిరిటీ, శుభలేక సుధాకర్ తదితరులు
నిర్మాత: రవి కస్తూరి
దర్శకత్వం: దయానంద్
మ్యూజిక్: నవాబ్ గ్యాంగ్, అశ్విన్ - అరుణ్
సినిమాటోగ్రఫి: అరవింద్ విశ్వనాథన్
డైలాగ్స్: విజయ్ కుమార్ సీ హెచ్
ఒరిజినల్ బ్యాగ్రౌండ్ స్కోర్: అభిషేక్ ఏ ఆర్
ఎడిటర్: వంశీ అట్లూరి
ప్రొడక్షన్ డిజైనింగ్: దిలీప్ జాన్, రాజ్ కమల్
స్టంట్స్: రామకృష్ణన్, నభా స్టంట్స్
కాస్ట్యూమ్స్: మనోజ్
బ్యానర్స్: కస్తూరి క్రియేషన్స్ ప్రొడక్షన్, గోల్డెన్ వింగ్ ప్రొడక్షన్స్
పీఆర్‌వో: మధు వీ ఆర్


Click it and Unblock the Notifications











