రొమాన్స్‌తో గేమ్ ఆన్ అంటున్న యువ జంట.. పడిపోతున్నా అంటూ శృంగారంగా!
వెంకటేశ్వరరావు కస్తూరి క్రియేషన్ బ్యానర్‌పై వెంకటేశ్వరరావు కస్తూరి, సాక్షి రవి సమర్పణలో దయానంద్ దర్శకత్వంలో యువ హీరో, హీరోయిన్లు గీతానంద్, నేహా సోలంకి నటించిన గేమ్ ఆన్ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ముస్తాబవుతున్నది. ఇటీవల ప్రారంభించిన ప్రమోషన్ కార్యక్రమాలు జోష్‌తో ఊపందుకొన్నాయి. ఈ ప్రమోషన్‌లో భాగంగా పడిపోతున్నా అనే లిరికల్ వీడియో సాంగ్‌ను రిలీజ్ చేయగా.. మంచి రెస్పాన్స్ లభిస్తున్నది. ఈ పాటకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
లవ్ అండ్ రొమాంటిక్ సాగే పడిపోతున్నా పాటకు అశ్విన్ అరుణ్ సంగీతం అందించగా.. కిట్టు విస్సాప్రగడ సాహిత్యం అందించారు. ఈ పాటను హారిక నారాయణ్, అనురాగ్ కులకర్ణి ఆలపించారు. ఈ పాటకు దయానంద్ కొరియోగ్రఫిని అందించారు.

తొలిసారి కాదా.. ఈ ప్రేమ
ఎదలోన ఉంది.. నువ్వేనా
ఇన్నాళ్లు లేని.. హైరానా
అలవాటుగానే కలిగేనా
నీ మాయలోన.. నీ ఊహలోన
నేనుండిపోనా హాయిగా
నీ చూపులోనా. నీ నవ్వులోన
నేనుండిపోనా హాయిగా
అంటూ పాట మెలోడిగా సాగింది. ఈ పాటపై చిత్రీకరించిన సన్నివేశాలు యూత్‌కు బాగా కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి.
నటీనటులు: గీతానంద్, నేహా సోలంకి, ఆదిత్య మీనన్, మధుబాల, వాసంతి, కిరిటీ, శుభలేక సుధాకర్ తదితరులు
బ్యానర్స్: కస్తూరి క్రియేషన్స్ ప్రొడక్షన్, గోల్డెన్ వింగ్ ప్రొడక్షన్స్
నిర్మాత: రవి కస్తూరి
దర్శకత్వం: దయానంద్
మ్యూజిక్: నవాబ్ గ్యాంగ్, అశ్విన్ - అరుణ్
సినిమాటోగ్రఫీ: అరవింద్ విశ్వనాథన్
డైలాగ్స్: విజయ్ కుమార్ సి.హెచ్
ఒరిజినల్ బ్యాగ్రౌండ్ స్కోర్: అభిషేక్ ఎ.ఆర్
ఎడిటర్: వంశీ అట్లూరి
ప్రొడక్షన్ డిజైనింగ్: దిలీప్ జాన్, రాజ్ కమల్
స్టంట్స్: రామకృష్ణన్, నభా స్టంట్స్
కాస్ట్యూమ్స్: మనోజ్
పిఆర్వో: మధు వి. ఆర్


Click it and Unblock the Notifications











