BAD అడవికి గొడ్డలి.. కత్తికి కోబలి బ్యాడ్.. నేహా శెట్టి మూవీ ఎన్ని మిలియన్ల వ్యూస్ సాధించిందంటే?

ప్రముఖ సినీ నిర్మాణ సంస్థలు సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య రూపొందించిన ఈ చిత్రంలో మాస్ కా దాస్ విశ్వక్ సేన్, నేహా శెట్టి, అంజలి నటించారు.

ఈ సినిమా పాటలు ప్రముఖ్య ఆడియో కంపెనీ ఆదిత్య మ్యూజిక్ ద్వారా మార్కెట్‌లోకి రిలీజ్ అయ్యాయి. యువన్ శంకర్ రాజా సంగీత దర్శకత్వం వహించిన ఈ సినిమా పాటలు చార్ట్ బస్టర్, సోషల్‌ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి. ఈ సినిమాలోని ట్రెండింగ్ పాటల వివరాల్లోకి వెళితే...

Gangs of Godavari movies Bad Themes song Trending on Youtube Here is Views count

యువ రచయిత, దర్శకుడు కృష్ణ చైతన్య డైరెక్షన్ రూపొందిన ఈ సినిమాలోని బ్యాడ్ - అనే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి థీమ్ సాంగ్ సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకొంటున్నది. ఈ పాటకు కల్యాణ్ చక్రవర్తి, త్రివిక్రమ్ సాహిత్యం అందించారు. యువన్ శంకర్ రాజా స్వరాలు సమకూర్చారు.

లంకల రత్న పాత్ర తీరుని తెలియజేస్తూ సాగిన "బ్యాడ్" గీతంలోని సాహిత్యం అద్భుతంగా ఉంది. బలమైన పదాలతో, లోతైన భావాలను పలికిస్తూ కళ్యాణ్ చక్రవర్తి అందించిన సాహిత్యం కట్టిపడేసింది. ముఖ్యంగా ప్రముఖ రచయిత-దర్శకుడు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలం నుంచి జాలువారిన సాకి.. ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

బ్యాడ్ థీమ్ సాంగ్ ఎలా సాగిందంటే..

అడవికి గొడ్డలి
కడుపుకు అంబలి
కత్తికి కోబలి
మట్టికి నాగలి - BAD

అడవికి గొడ్డలి - BAD
కడుపుకు అంబలి - BAD
కత్తికి కోబలి - BAD
మట్టికి నాగలి - BAD

లోకమంతా బ్యాడ్...
లోకులంతా బ్యాడ్
చెప్పేవాడు బ్యాడ్
వినేవాడు బ్యాడ్ బ్యాడ్ః
దోచుకొంటే బ్యాడ్
దోపిడైతే బ్యాడ్
దొబ్బి తిండే బ్యాడ్
దొబ్బకుంటే బ్యాడ్
తిట్టకుంటే బ్యాడ్
తిన్నగుంటే బ్యాడ్
తొక్కుతుంటే బ్యాడ్
తొక్కకుంటే బ్యాడ్

గయ్యుమంటే బ్యాడ్
గమ్మునుంటే బ్యాడ్
గుచ్చుకుంటే బ్యాడ్
గుచ్చకుంటే బ్యాడ్

ఏమో ఎప్పుడు మొదలైందో..
మనకీ మంచికి ఈ యుద్దం
గెలుపు ఓటమిదేముంది
మనిషికి ఏడవడం ఇష్టం
అంటూ ర్యాప్ తరహా సాగే సాంగ్ యూత్‌ను విశేషంగా ఆకట్టుకొంటున్నది. య్యూట్యూబ్‌లో ట్రెండింగ్‌గా మారింది.

ఇప్పటికే ఈ సాంగ్‌ య్యూట్యూబ్‌లో భారీగా, రికార్డు స్థాయిలో వ్యూస్ సాధిస్తున్నది. ఈ సాంగ్ 22 స్థానంలో ట్రెండ్ అవుతూ 222K వ్యూస్ సాధించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X