Gangs of Godavari: య్యూట్యూబ్‌లో మోత మోగిస్తున్న విశ్వక్ సేన్ పాట.. ఎన్ని లక్షల వ్యూస్ అంటే..

యువ రచయిత కృష్ణ చైతన్య దర్శకుడిగా మారి రూపొందించిన చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ప్రముఖ నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా, నేహా శెట్టి, అంజలి హీరోయిన్లుగా నటించారు.

యువన్ శంకర్ రాజా సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలు ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలయ్యాయి. ఇక ఈ సినిమాలోని గిరి గిరి అనే పాట యూట్యూబ్, సోషల్ మీడియాలో భారీగా స్పందనను కూడగట్టుకొంటున్నది. ఈ పాటకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

ధూం తడి.. ద్వారంపూడి
రారడి.. గొల్లపూడి
ధూం తడి.. ద్వారంపూడి
రారడి.. గొల్లపూడి
కత్తిపుడి.. కారంపూడి
కిందపడి.. మీదపడి..
చేయర బన్నా ఎదురుదాడి..
అదిరబన్నా.. అరికపూడి

సచ్చి మంచోడై స్వర్గం పోవాలా?
బతికి మంచి చేస్తూ.. స్వర్గం చూడాలా?
మంచోడనే చెడ్డపేరేలా మావా?
మావా..మావా మనవూళ్లా
పెద్ద సదువుతో కోలువే చేయాలా?
ఇస్తిరి బట్టలతో కంపు మనకేలా?
మావా చెమటే మన అందం..
కష్టంగా మట్టేందుకు తొక్కాలా?
మనిషినే తొక్కి ఎదిగేస్తే.. సరిపోలా
పనిచేసి పొట్టేందుకు నింపాలా?
బలిసున్నా లేకున్నా..
చల్ పొట్టే కొట్టి.. మెట్కెక్కాలా అొంటూ సాగే పాటను విశ్వక్ సేన్ బృందంపై చిత్రీకరించారు. జీవిత సారాన్ని తెలిపే.. ఈ పాటకు యువన్ శంకర్ రాజా సంగీతం అందించగా.. కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించగా.. గాయకుడు రామ్ మిర్యాల ఆలపించారు.

Gangs of Godavari Music Album Review Vishwak Sen s Giri Giri Song trending in Youtube

గిరి గిరి అనే పాటకు యూట్యూబ్‌లో భారీగా వ్యూస్ లభిస్తున్నాయి. మే 29వ తేదీన విడుదలైన లిరికల్ వీడియో సుమారుగా 3 లక్షల వ్యూస్ సాధించింది. దాదాపు 9 వేల మంది లైక్ చేశారు.

ఇదిలా ఉండగా, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రం విడుదలై అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకొంటున్నది. ఈ సినిమా మూడు రోజుల్లో సుమారుగా 11 కోట్లకుపైగా కలెక్షన్లను రాబడుతున్నది. ఇక ఈ సినిమాలోని పాటలు రిలీజ్ తర్వాత మరింత పాపులారిటిని సొంతం చేసుకొంటున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X