Gowri Kalyanam: ఒక్క పాట కోసం అంతమంది సింగర్లా!.. వైరల్ అవుతున్న 'గౌరీ కల్యాణ వైభోగమే' సాంగ్

ఎలాంటి ఒత్తిడినైనా దూరం చేసే శక్తి మంచి సంగీతం, పాటలకు ఉంది. మంచి గాత్రం ఉన్న గాయనీ గాయకుల సాంగ్స్ వింటే చాలు అన్నీ మరిచిపోయి.. హాయిగా రిలాక్స్ అవుతాం. మనందరికీ కచ్చితంగా ఒకరొ.. ఇద్దరొ ఫేవరెట్ సింగర్స్ ఉండే ఉంటారు. ఇక వారు పాడే పాటలంటే మనకు ఎంత ఇష్టముంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాంటిది ఒకేసారి ఆరుగురు సింగర్స్ కలిసి పాడితే?. అది ఒక పెళ్లి పాట అయితే? ఆ వివరాలంటో ఓ లుక్కేద్దామా!

 పెళ్లి పుస్తకం నుంచి..

పెళ్లి పుస్తకం నుంచి..

తెలుగు సినిమాల్లోని పెళ్లి పాటలకు ఉండే క్రేజే వేరు. సాంగ్ హిట్ అవ్వాలే గానీ, ప్రతి పెళ్లి ఫంక్షన్ లో మారుమోగిపోతూనే ఉంటుంది. అప్పట్లో వచ్చిన పెళ్లి పుస్తకం సినిమాలోని శ్రీరస్తూ శుభమస్తు నుంచి మహేశ్ బాబు మురారి చిత్రంలోని అలనాటి రామచంద్రుడు వరకు ఎన్నో పాటలు పెళ్లి మండపాల్లో వినిపిస్తూ ఉంటాయి.

బుల్టెట్టు బండెక్కి సాంగ్..

బుల్టెట్టు బండెక్కి సాంగ్..

అంతేకాకుండా ఇటీవల వచ్చిన నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తాపా గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పుడు అదే బాటలో మరో పాట వచ్చేసింది. ఈ సాంగ్ ను ఒకరు కాదు, ఇద్దరు కాదు.. ఏకంగా టాప్ 6 సింగర్స్ పాడటం విశేషం. ఇంతకీ ఇది ఏం పాటంటే.. గౌరీ కల్యాణ వైభోగమే (Gowri Kalyan Vaibhogame Song) సాంగ్.

ఆకట్టుకుంటున్న పదాలు..

ఆకట్టుకుంటున్న పదాలు..

ఈ పాటను ఏకంగా ఆరుగురు సింగర్స్ పాడారు. సత్య యామిని, సాకేత్ కోమండూరి, గీతా మాధురితోపాటు పాపులర్ అయిన మనీషా ఈరబత్తిని, సమీరా భరద్వాజ్, అనుదీప్ కలిసి మొత్తంగా ఆరుగురు గాత్రం కలిపారు. గౌరీ కల్యాణ వైభోగవమే అంటూ విడుదలైన ఈ పాటలో శ్రీరస్తు పలికే వేద మంత్రాలు.. శుభమస్తు పలికే పంచభూతాలు వంటి పదాలు సంగీత ప్రియులను ఎంతో ఆకట్టుకుంటున్నాయి.

లక్షల్లో వ్యూస్..

లక్షల్లో వ్యూస్..


ప్రముఖ టెక్ట్స్ టైల్స్ సంస్థ అయిన గౌరీ సిగ్నేచర్స్ కోసం ఈ పాటను రూపొందించినట్లు తెలుస్తోంది. అలాగే ఈ సాంగ్ పిక్చరైజేషన్ కూడా ఎంతో ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ తెగ వైరల్ అవుతోంది. ఇప్పటికే ఈ సాంగ్ కు యూట్యూబ్ లో లక్షల్లో వ్యూస్ వచ్చాయి. ఈ సాంగ్ వీడియోలో సింగర్స్ కాస్ట్యూమ్స్ సైతం అట్రాక్ట్ చేస్తున్నాయి.

ఛాలెంజ్ కాంటెస్ట్..

ఇక ఈ పాటకు విన్ను ముత్యాల దర్శకత్వం వహించగా.. కేశవ కిరణ్ సాహిత్యం అందించారు. అతి తక్కువ సమయంలో ప్రేక్షకులకు దగ్గరైన ఈ పాట పేరుతో ఒక కాంటెస్ట్ కూడా నిర్వహిస్తున్నారు. గౌరీ కల్యాణం సింగింగ్ చాలేంజ్ కాంటెస్ట్ (Gowri Kalyanam Singing Challenge Contest) పోటీలో పాల్గొన్న వాళ్లకు బహుమతులు అందిస్తున్నారు. తెలుగు సాంప్రాదాయానికి అద్దం పడుతున్న ఈ పాటపై మీరు కూడా ఓ లుక్కేయండి మరి!

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X