బయోపిక్ కోసం మా అనుమతి తీసుకోవాలి.. లేకుంటే చట్టపరమైన చర్యలు!
ప్రస్తుతం టాలీవుడ్ లో బయోపిక్ చిత్రాలకు మంచి డిమాండ్ నెలకొని ఉంది. ఈ ఏడాది విడుదలైన సావిత్రి బయోపిక్ చిత్రం మహానటి ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం రూపు దిద్దుకుంటోంది. మెగాస్టార్ చిరంజీవి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర సైరా నరసింహారెడ్డి చిత్రంలో నటిస్తున్నాడు.
తాజగా దిగ్గజ సంగీత దర్శకుడు ఘంటసాల బయోపిక్ అంశం తెరపైకి వచ్చింది. ఘంటసాల జీవిత చరిత్రని రూపొందించేందుకు ఇండస్ట్రీలో ప్రయత్నాలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై ఘంటసాల తనయుడు రత్నకుమార్ స్పందించారు. నాన్నగారి జీవిత చరిత్రని తెరకెక్కించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మమ్మల్ని ఇంతవరకు ఎవరూ సంప్రదించలేదు. మా అనుమతి లేకుండా నాన్నగారి బయోపిక్ తీయలేరు. మాకంటూ మనోభావాలు ఉంటాయి కదా. తమని సంప్రదించకుండా, అనుమతి లేకుండా బయోపిక్ తీయాలని ప్రయత్నిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అని రత్నకుమార్ హెచ్చరించారు. సిహెచ్ రామారావు ఈ చిత్రానికి దర్శత్వం వహించబోతున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











