Game Changer గేమ్ ఛేంజర్ మరో రికార్డు.. రాంచరణ్ మూవీ మ్యూజిక్ రైట్స్‌కు ఫ్యాన్సీ రేటు!
మెగా పవర్ స్టార్, గ్లోబల్ స్టార్ రాంచరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న గేమ్ ఛేంజర్ సినిమా విడుదలకు ముందే సంచలనాలకు కేంద్ర బిందువుగా మారింది. ఈ సినిమాకు సంబంధించిన బడ్జెట్, పాటల కోసం పెడుతున్న భారీ ఖర్చు ఇండస్ట్రీలో ప్రకంపనాలు రాజేస్తున్నాయి. ఇటీవల లీకైన పాటతో మరింత సంచలనంగా మారింది. ఈ క్రమంలో ఈ సినిమా మ్యూజిక్ రైట్స్ అమ్మకం ఇండియన్ ఇండస్ట్రీలో టాక్‌గా మారింది. ఈ సినిమా మ్యూజిక్ రైట్స్ ఎవరు దక్కించుకొన్నారు. ఎందుకు అమ్ముడుపోయాయనే వివరాల్లోకి వెళితే..
గేమ్ ఛేంజర్ సినిమా బడ్జెట్ విషయానికి వస్తే.. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను సుమారుగా 450 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. ఖర్చుకు వెనుకాడకుండా ఇండియన్ సినిమా రంగంలో క్రేజీగా నిలిచే ప్రాజెక్టుగా నిర్మిస్తున్నారు.

తన సినిమాల్లో మ్యూజిక్ అత్యంత ప్రధాన్యం ఇచ్చే దర్శకుడు శంకర్.. ఈ సినిమా కోసం తమన్ ను మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎంచుకొన్నారు. ఈ సినిమాలోని పాటల కోసం సుమారు 150 మంది మ్యూజిషియన్స్‌తో కంపోజ్ చేశారు. ఈ సినిమాలోని జరగండి పాటను దీపావళీ పండుగకు రిలీజ్ చేయనున్నారు.
ఇలాంటి సెన్సేషనల్ వార్తల మధ్య గేమ్ ఛేంజర్ మ్యూజిక్ రైట్స్‌ను ప్రముఖ ఆడియో కంపెనీ దక్కించుకొన్నారు. ఈ సినిమా మ్యూజిక్ రైట్స్ కోసం సారేగమ గ్లోబల్ సంస్థ భారీ మొత్తాన్ని చెల్లించి సొంతం చేసుకొన్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఎంత మొత్తానికి అమ్మారనే విషయాన్ని వెల్లడించకుండా ఫ్యాన్సీ రేటు పలికిందని తెలిపారు.

రాంచరణ్‌తోపాటు కియారా అద్వానీ నటిస్తున్న ఈ సినిమాలో అంజలి, ఎస్‌జే సూర్య, జయరాం, సునీల్, శ్రీకాంత్, సముద్రఖని, రాజర్, నవీన్ చంద్ర, రాజీవ్ కనకాల తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకు బుర్రా సాయిమాధవ్ మాటలు అందిస్తున్నారు. షామిర్ మహ్మద్ ఎడిటింగ్, తిరు సినిమాటోగ్రఫిని అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











