Don't Miss!
- Finance IREDA: భారీగా లాభాలను ప్రకటించిన ఐఆర్ఈడీఏ..
- Sports సూపర్ మ్యాన్ జడేజా: గాల్లోకి డైవ్ చేస్తూ ఒంటిచేత్తో క్యాచ్ Video
- Automobiles మరింత తక్కువ ధరలో బజాజ్ చేతక్ ఇ స్కూటర్.. త్వరలో లాంచ్.!!
- Technology Dell నుంచి నాలుగు కొత్త Ai ల్యాప్‌టాప్‌లు! ధర,స్పెసిఫికేషన్లు
- News భారీ వర్షం - వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..!!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
‘జ్వాలా రెడ్డి’కి ఊహించని స్పందన: 10 మిలియన్ దాటేసిన ‘సిటీమార్’ సాంగ్
టాలెంటెడ్ మాస్ హీరో గోపీచంద్ హీరోగా.. కమర్షియల్ డైరెక్టర్‌గా పేరొందిన సంపత్ నంది తెరకెక్కించిన చిత్రం 'సీటీమార్'. కబడ్డీ ఆట నేపథ్యంతో రూపొందిన ఈ సినిమాలో హీరో కోచ్‌గా నటించాడు. అలాగే, హీరోయిన్ తమన్నా కూడా ఓ జట్టుకు శిక్షకురాలిగా నటించింది. చాలా రోజుల క్రితమే ఈ మూవీ షూటింగ్ పూర్తి అయినప్పటికీ.. అనివార్య కారణాల వల్ల విడుదల వాయిదా పడుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఈ మూవీని విడుదల చేయాలని భావించారు. ఇందులో భాగంగానే ఒక్కొక్కటిగా పాటలను విడుదల చేశారు. అందులో ఓ పాట రికార్డు వ్యూస్ సాధించింది.
గోపీచంద్ నటించిన 'సీటీమార్' నుంచి ఆ మధ్య 'జ్వాలా రెడ్డి' అనే పాట విడుదలైంది. మెలోడీ కింగ్ మణిశర్మ కంపోజ్ చేసిన ఈ సాంగ్‌ను శంకర్ బాబు, మంగ్లీ ఆలపించారు. కాసర్ల శ్యామ్ దీనికి లిరిక్స్ రాశారు. మాస్ బీట్తో వచ్చిన దీనికి ప్రేక్షకుల నుంచి ఊహించని రీతిలో స్పందన వచ్చింది. ఫలితంగా వ్యూస్ కూడా భారీగానే వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ పాట 10 మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. అంటే అక్షరాల కోటి మంది ఈ లిరికల్ వీడియోను యూట్యూబ్‌లో వీక్షించారు. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ తాజాగా ఓ పోస్టర్‌ను కూడా వదిలింది.
గోపీచంద్ కెరీర్లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'సీటీమార్' మూవీని పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస చిత్తూరి నిర్మిస్తున్నారు. మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా హీరోయిన్గా చేస్తోంది. భూమిక చావ్లా కీలక పాత్రను పోషిస్తోంది. అలాగే, ఇందులో అప్సరా రాణి ఓ స్పెషల్ సాంగ్‌ను చేసింది. వీళ్లతో పాటు రావు రమేష్, తరుణ్ అరోరా, వెన్నెల కిశోర్ తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది.