twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘జ్వాలా రెడ్డి’కి ఊహించని స్పందన: 10 మిలియన్ దాటేసిన ‘సిటీమార్’ సాంగ్

    |

    టాలెంటెడ్ మాస్ హీరో గోపీచంద్ హీరోగా.. కమర్షియల్ డైరెక్టర్‌గా పేరొందిన సంపత్ నంది తెరకెక్కించిన చిత్రం 'సీటీమార్'. కబడ్డీ ఆట నేపథ్యంతో రూపొందిన ఈ సినిమాలో హీరో కోచ్‌గా నటించాడు. అలాగే, హీరోయిన్ తమన్నా కూడా ఓ జట్టుకు శిక్షకురాలిగా నటించింది. చాలా రోజుల క్రితమే ఈ మూవీ షూటింగ్ పూర్తి అయినప్పటికీ.. అనివార్య కారణాల వల్ల విడుదల వాయిదా పడుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఈ మూవీని విడుదల చేయాలని భావించారు. ఇందులో భాగంగానే ఒక్కొక్కటిగా పాటలను విడుదల చేశారు. అందులో ఓ పాట రికార్డు వ్యూస్ సాధించింది.

    గోపీచంద్ నటించిన 'సీటీమార్' నుంచి ఆ మధ్య 'జ్వాలా రెడ్డి' అనే పాట విడుదలైంది. మెలోడీ కింగ్ మణిశర్మ కంపోజ్ చేసిన ఈ సాంగ్‌ను శంకర్ బాబు, మంగ్లీ ఆలపించారు. కాసర్ల శ్యామ్ దీనికి లిరిక్స్ రాశారు. మాస్ బీట్‌తో వచ్చిన దీనికి ప్రేక్షకుల నుంచి ఊహించని రీతిలో స్పందన వచ్చింది. ఫలితంగా వ్యూస్ కూడా భారీగానే వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ పాట 10 మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. అంటే అక్షరాల కోటి మంది ఈ లిరికల్ వీడియోను యూట్యూబ్‌లో వీక్షించారు. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ తాజాగా ఓ పోస్టర్‌ను కూడా వదిలింది.

    Gopichands Seetimaarr​ JwalaReddy​ Lyrical Reach 10M

    గోపీచంద్ కెరీర్‌లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'సీటీమార్' మూవీని పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస చిత్తూరి నిర్మిస్తున్నారు. మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా హీరోయిన్‌గా చేస్తోంది. భూమిక చావ్లా కీలక పాత్రను పోషిస్తోంది. అలాగే, ఇందులో అప్సరా రాణి ఓ స్పెషల్ సాంగ్‌ను చేసింది. వీళ్లతో పాటు రావు రమేష్, తరుణ్ అరోరా, వెన్నెల కిశోర్ తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది.

    English summary
    Seetimaarr is an upcoming Indian Telugu-language sports action film directed by Sampath Nandi which stars Gopichand, Tamannaah and Digangana Suryavanshi in lead roles. The filmmakers planned a release in mid 2020, but the production was halted due to the COVID-19 pandemic. The film is scheduled to release on 2 April 2021.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X