భర్త ముందే నగ్నంగా మారిన ర్యాపర్ భార్య.. గ్రామీ 2025 అవార్డుల్లో సంచలనం
అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే గ్రామీ అవార్డుల కార్యక్రమంలో సంచలనం చోటు చేసుకొన్నది. ప్రపంచ మ్యూజిక్ రంగంలో అత్యంత ప్రతిభను చాటి వారికి ఇచ్చి పురస్కారాల కార్యక్రమంలో ర్యాపర్ భార్య తన ఒంటిపై ఉన్న కోట్‌ను తీసివేసి నగ్నంగా మారడంతో స్టేజీ మీద ఏం జరుగుందో కాసేపు భర్తకు, ఆ తర్వాత ఆడియెన్స్ అర్ధం కాలేదు. ఈ ఘటన మ్యూజిక్ వరల్డ్‌లో సంచలనం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
గ్రామీ అవార్డులు 2025 కార్యక్రమంలో ప్రఖ్యాత ర్యాపర్ కాన్యే వెస్ట్ బెస్ట్ ర్యాపర్ కేటగిరిలో నామినేట్ అయ్యారు. కార్నివాల్ అనే ఆల్బమ్‌లోని ట్రై డోలా సైన్ అనే పాట నామినేట్ కావడంతో అవార్డుల కార్యక్రమానికి భార్యతో కలిసి వేడుకకు హాజరయ్యారు. గ్రామీ రెడ్ కార్పెట్‌పై కాన్యే తన భార్య బియాంక సెన్సోరితో కలిసి నడిచారు. స్టేజ్‌పైకి వెళ్లిన తర్వాత హఠాత్తుగా తన ఒంటిపై ఉన్న డ్రస్‌ను తొలగించింది.

కాన్యే వెస్ట్ తన బియాంక సెన్సోరితో కలిసి స్టేజ్ మీద నిలచుకొన్నాడు. అయితే పక్కనే ఉన్న ఆయన భార్య వెంటనే అతడికి ఎదురుగా వచ్చి.. తన ఒంటిపై ఉన్న బ్లాక్ కోట్‌ను తొలగించింది. దాంతో అక్కడ ఉన్న వారంతా ఆమె నగ్నంగా కనిపించే సరికి అవాక్కయ్యారు. అయితే తన శరీరానికి సరిపడే రంగుతో ఉన్న పలచటి పొర ఉన్న డ్రస్సు ఆమె ఒంటిపై ఉండటం వల్ల పూర్తిగా ఆమె న్యూడ్ కనిపించింది. అయితే పలచటి డ్రస్ ధరించడంతో ఆమె నగ్నంగా ఉన్నారనే భ్రమను కలిగించింది.
బియాంక సెన్సోరీ ఘటన తర్వాత గ్రామీ నిర్వాహకులు కఠినంగా వ్యవహరించారు. వారికి ఆహ్వానం లేదనే కారణంతో కాన్యే వెస్ట్‌ను, సెన్సోరీని అక్కడ నుంచి బయటకు పంపించారు. ఆ తర్వాత స్టేజ్‌పై చేసిన నిర్వాకానికి సంబంధించిన వీడియోను, పోస్టును అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచి తొలగించారు.
బియాంక సెన్సోరీ సంఘటనపై సోషల్ మీడియాలో మిక్స్‌డ్ రియాక్షన్స్ వచ్చాయి. అయితే ఆమె వీడియోలను పోస్టు చేసి భారీగా కామెంట్స్ చేయడంతో అవి సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి. ఆమె ఫ్యాషన్ డిజైన్ టేస్ట్ బాగుంది. అదిరిపోయింది. కోటు వేసుకోవడానికి చాలా ఇబ్బంది పడినట్టు ఉంది. బియాంక సెన్సోరికి కాన్యే మధ్య సంబంధాలు బాగా లేవు. ఆమెను బహిరంగంగానే ఇబ్బందికి గురి చేస్తుంటారు. వారి బంధంలో ఎవరూ కూడా తలదూర్చలేనటు వంటి విషయంగా మారింది అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











