Remembering SPB: ఆ ఒక్క పాటతో జీవితమే మారింది.. బాలు మొదటి రెమ్యునరేషన్ ఎంతంటే?
తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో మధురమైన పాటలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న గాయకులలో ఎస్పీ బాలసుబ్రమణ్యం ఒకరు. ఎలాంటి పాట పాడిన కూడా అందులోని మాధుర్యాన్ని అర్ధాన్ని కూడా గుండెకు తాకే విధంగా పాడగల అతి కొద్దిమంది వారిలో బాలు మాత్రమే టాప్ లిస్టులో ఉంటారు అని చెప్పవచ్చు.
ఇక ఆయన మరణించి రెండేళ్లు అయినా కూడా పాటలతో మాత్రం ఇంకా అందరిలోనూ ఆయన బతికే ఉన్నారు అని ఆలోచన కలుగుతుంది. ఇక బాలసుబ్రమణ్యం జయంతి సందర్భంగా సోషల్ మీడియాలో చాలామందిని ఆయనను గుర్తు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో బాలసుబ్రమణ్యం మొదటి పాట కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఆయన మొదటి పాటకు అందుకున్న రెమ్యూనరేషన్ ఎంత అనే వివరాల్లోకి వెళితే..

భాషతో సంబంధం లేకుండా: బాలసుబ్రమణ్యం తెలుగు వారు అయినప్పటికీ కూడా భాషతో సంబంధం లేకుండా ఆయన ఇండియా మొత్తంలో కూడా మంచి క్రేజ్ అందుకున్నారు. హిందీ తమిళ్ మలయాళం భోజ్పురి కన్నడ ఇలా ఏ భాషలో అయినా సరే బాలు చాలా పాటలు పాడి స్థానిక భాషకు కూడా ఒక గొప్ప గౌరవాన్ని తీసుకు వచ్చారు. ఆయన ఏ భాషలో పాడిన కూడా అక్కడి ప్రేక్షకులు ఆయనకు బ్రహ్మరథం పట్టేవారు. ఇప్పటికే కొంతమంది ఆయనను దైవంగానే కులుస్తూ ఉంటారు.

అక్కడే ఎక్కువ ఫ్యాన్స్: ముఖ్యంగా తెలుగులో కంటే బాలసుబ్రహ్మణ్యం కు కన్నడ ఇండస్ట్రీలో చాలామంది హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారని చెప్పాలి. ఆయన వస్తున్నారు అంటే చాలు అప్పట్లో చాలామంది జనాలు ఆయన కారు ముందు నిలబడి నమస్కారాలు చేస్తూ ఉండేవారు. బాలు గారిని ఒక్కసారి చూస్తే చాలు అని అనుకుంటారు. ఆ విధంగా ఆయన కన్నడ చిత్రపరిశ్రమలో కూడా ఎంతగానో గుర్తింపునందుకున్నారు.

మొదటి సినిమా అవకాశం: ఇక బాలసుబ్రమణ్యం మొదటి పాట ఎప్పుడూ ఎక్కడ పాడారు అనే వివరాల్లోకి వెళితే, మొదట ఆయన స్టేజ్ షోలలోనే పాటలు పాడుతూ ఉండేవారు. ఇక తర్వాత సినిమాల్లో అవకాశాల కోసం అని మద్రాసు వెళ్లడం జరిగింది. అక్కడ ఎన్నో రోజుల తరువాత ఒక అవకాశం దక్కింది. 1996లో 'శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న' చిత్రం ద్వారా ఎస్పీ బాలుకు తొలిసారి వెండితెరపై ఓ పాట పాడే అవకాశం దక్కింది.

మొదటి రెమ్యునరేషన్: బాలు పాడిన మొదటి పాటకు ఎస్‌పి కోదండపాణి బాణీలు అందించారు. నటుడు పద్మనాభం ఆ సినిమాను నిర్మించగా గాయని పి.సుశీలతో కలిసి "ఏమి వింత మోహం" అనే పాటను బాలు ఆలపించారు. ఇక ఆ పాట పాడినందుకు గాను బాలు గారికి అప్పట్లో 150 రూపాయల రెమ్యునరేషన్ దక్కింది. ఇక ఆ తరువాత ఆయన వెనక్కి తిరిగి చూసుకోలేదు. వెంటనే అదే సంగీత దర్శకుడితో కూడా మరిన్ని సినిమాల్లో పాటలు పాడే అవకాశం అందుకున్నారు.

ఆ రికార్డును తొందరగానే: ఇక అప్పట్లో అత్యధికంగా ఘంటసాల ఒక్క పాటకు 500 రూపాయల రెమ్యునరేషన్ తీసుకునేవారట. ఇక ఆ తరువాత బాలసుబ్రహ్మణ్యం ఆ రేటును తొందరగానే అందుకున్నారు. ఇక బాలసుబ్రహ్మణ్యం క్లిక్ కావడంతో సౌత్ ఇండస్ట్రీలో అప్పుడు అందరికంటే ఎక్కువ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకున్నారు. ఇక బాలు మొత్తంగా 40 వెలకు పైగా పాటలు పాడారు. బాలుగారు మరణించినా కూడా ఆయన పాటలు మాత్రం చిరస్థాయిగా నిలిచిపోయాయి. ఇక నేడు పుట్టినరోజు సందర్భంగా అభిమానులు ఆయనకు నివాళులర్పిస్తున్నారు.


Click it and Unblock the Notifications











