Guntur Kaaram కుక్కల కంటే హీనంగా.. మహేష్ ఫ్యాన్స్‌పై రామజోగయ్య దారుణంగా.. ఓ మై బేబీ పాట వివాదంలో ట్విస్ట్!

సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు ఎంతోకాలంగా ఎదురు చూసిన గుంటూరు కారం సినిమాలోని రెండో పాటను ఇటీవల రిలీజ్ చేశారు. అయితే తొలి పాట ధమ్ మసాలాను గుండెలో పెట్టుకొన్న అభిమానులు రెండోపాట ఓ మై బేబీ పై విరుచుకుపడి ట్రోల్స్ చేస్తున్నారు. ఆ పాటకు సంగీతం అందించిన మ్యూజిక్ డైరెక్టర్ తమన్, గీత రచయిత రామజోగయ్య శాస్త్రిని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. అయితే మహేష్ అభిమానులు చేస్తున్న ట్రోల్స్‌పై రామజోగయ్య శాస్త్రి స్పందిస్తూ..

గుంటూరు కారం సినిమాలోని ఓ మై బేబీ పాట అటు మహేష్ బాబు అభిమానులనే కాకుండా సాధారణ ప్రేక్షకులకు కనెక్ట్ కాలేకపోయింది. దాంతో పాట విన్న వింటనే తమన్, రాంజోపై దారుణంగా ట్వీట్ల వర్షాన్ని కొనసాగిస్తున్నారు. మహేష్ బాబు సినిమా స్థాయిలో లేదనే వాదనను వినిపిస్తూ కామెంట్లు చేస్తున్నారు.

Guntur Kaaram lyricist Rama Jogaiah Shastry balst Mahesh Babu fans over Oh My Baby Song Contraversy

అయితే తమపై వస్తున్న ట్రోలింగ్‌పై గీత రచయిత రామజోగయ్య శాస్త్రి ట్విట్టర్‌లో స్పందిసత్ూ.. ప్రతీవాడు మాట్లాడే వాడే.. ప్రతీ వాడు రాయి విసిరే వాడే. అభిప్రాయాన్ని చెప్పేదానికి ఓ పద్దతి ఉంటుంది. పాట నిడివి తప్ప నిన్నటి పాటకు ఏం తక్కువైంది. మీ హీరోపై మీ కన్నా ఎక్కువ ప్రేమే మాక్కూడా. ఆ ప్రేమ లేకపోతే.. ప్రేమించకపోతే మా పని మేం గొప్పగా చేయ్యలేం. తెలుసుకొని ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడండి అంటూ రామజోగయ్య శాస్త్రి అన్నారు.

Guntur Kaaram lyricist Rama Jogaiah Shastry balst Mahesh Babu fans over Oh My Baby Song Contraversy

అయితే రామజోగయ్య శాస్త్రికి కామెంట్‌కు ఓ అభిమాని స్పందిస్తూ.. ఇదే నిజం. రామజోగయ్య శాస్త్రి చాలా చెత్తగా లిరిక్స్ రాశాడు. తమన్ ఇచ్చిన మ్యూజిక్ చాలా వరస్ట్‌గా ఉంది. నిర్మాత నాగవంశీ ఓవరాక్షన్ చేస్తుంటాడు. అసలు గుంటూరు కారం మూవీ ఎటు వెళ్లిపోతుందో తెలియని పరిస్థితి అంటూ కామెంట్ చేశాడు.

Guntur Kaaram lyricist Rama Jogaiah Shastry balst Mahesh Babu fans over Oh My Baby Song Contraversy

అయితే ఓ నెటిజన్ చేసిన పోస్టుపై రచయిత రామజోగయ్య శాస్త్రి మరింత ఘాటుగా స్పందించాడు. సోషల్ మీడియాలో నెటిజన్లు కుక్కల కంటే హీనంగా ఉన్నారు. ప్రాసెస్ గురించి వారికి ఏమీ తెలియదు. కానీ వారు పాటల గురించి, మ్యూజిక్ గురించి మాట్లాడుతూ జడ్జీలుగా కామెంట్ చేస్తుంటారు. మనసులో ద్వేషం పెట్టుకొని కామెంట్స్ చేస్తుంటారు. సినిమా పరిశ్రమపై విషం కక్కుతుంటారు. టెక్నిషియన్స్‌ను టార్గెట్ చేస్తుంటారు. ఇది మంచి పద్దతి కానే కాదు అని ఆయన అన్నారు.

సోషల్ మీడియాలో పెరిగిపోతున్న ట్రోల్స్, దాడుల గురించి ఎవరో ఒకరు మాట్లాడాలి. సోషల్ మీడియాలో నెటిజన్లు గీత దాటుతున్నారు. ఇలాంటి వారికి చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది అనే విధంగా రామజోగయ్య శాస్త్రి ట్వీట్ చేయడం ట్విట్టర్‌లో వైరల్ అయింది. అయితే రామజోగయ్య శాస్త్రికి ఓ నెటిజన్ కౌంటర్ ఇస్తూ.. రాతలు ఉన్నయి చదవడానికే.. గీతలు ఉన్నవి దాటడానికే అంటూ త్రివిక్రమ్ చెప్పిన ఓ మాటను కోట్ చేశాడు.

Guntur Kaaram lyricist Rama Jogaiah Shastry balst Mahesh Babu fans over Oh My Baby Song Contraversy

రామజోగయ్యశాస్త్రి కామెంట్స్‌కు నెటిజన్లు ఘాటుగా జవాబిస్తున్నారు. అందరూ బాధ్యతగా ఉండాలి. మీరు బాగా రాస్తే నెత్తిన పెట్టుకొంటాం కొన్నిసార్లు. ఒకసారి బాగా రాయలేదంటే.. కుక్కలు అంటారా? మీకు విమర్శలు, ఫీడ్ బ్యాక్ స్వీకరించలేరు. మీకు కేవలం భజన చేసే వాళ్లు కావాలి అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. అయితే కాస్త కూల్ అయిన రాంజో.. సక్రమంగా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఫీడ్‌బ్యాక్‌ను స్వాగతిస్తా. పద్దతి మీరకండి అని ఆయన సూచించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X