Guntur karam: అసలైన దానికి డేట్ ఫిక్స్.. మహేశ్ ఫ్యాన్స్ రెడీగా ఉండడమ్మా!

తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది హ్యాండ్సమ్ హీరోలు ఉన్నారు. కానీ, వారిలో అందరి కంటే ఎక్కువ ఫాలోయింగ్‌ను ఏర్పరచుకున్నది మాత్రం సూపర్ స్టార్ మహేశ్ బాబు అనే చెప్పాలి. అదే సమయంలో తనదైన చిత్రాలతో సందడి చేస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు మహేశ్ బాబు 'గుంటూరు కారం' అనే పక్కా మాస్ కమర్షియల్ సినిమాలో నటిస్తున్నాడు.

'అతడు', 'ఖలేజా' వంటి క్లాసిక్ చిత్రాల తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తోన్న చిత్రమే 'గుంటూరు కారం'. క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు ఏ రేంజ్‌లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వాటికి ఏమాత్రం తీసిపోని విధంగా దీన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.

Guntur karam Movie First Song Release on October 24th

సుదీర్ఘ కాలం తర్వాత మహేశ్ బాబు - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రాబోతున్న 'గుంటూరు కారం' మూవీకి సంబంధించిన షూటింగ్ చాలా రోజుల క్రితమే ప్రారంభం అయింది. అయితే, మధ్యలో కొన్ని అవాంతరాలు, డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో పాటు క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా షూట్‌ సజావుగా సాగలేదు. దీంతో ఈ చిత్రం ఆగిపోతుందేమో అని అంతా అనుకున్నారు.

చాలా బ్రేకుల తర్వాత 'గుంటూరు కారం' మూవీకి సంబంధించిన షూటింగ్ ఇటీవలే పున: ప్రారంభం అయింది. అప్పటి నుంచి ఎంతో వేగంగా చిత్రీకరణ జరుపుతూ వస్తున్నారు. ఇలా మిగిలిన భాగాన్ని మొత్తం ఏమాత్రం బ్రేకులు లేకుండా పూర్తి చేసుకుని.. మహేశ్ బాబు సినిమాను సంక్రాంతికే రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ పట్టుదలతో పని చేస్తోంది.

'గుంటూరు కారం' అప్‌డేట్ల కోసం మహేశ్ బాబు ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇందులోని మొదటి పాటను దసరాకు రిలీజ్ చేస్తామని నిర్మాత ఇటీవలే తెలిపారు. కానీ, దీనిపై క్లారిటీ రాలేదు. అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలోని మొదటి పాటను దసరా సందర్భంగా అక్టోబర్ 24వ తేదీన విడుదల చేయబోతున్నారని తెలిసింది. ఇదే జరిగితే సూపర్ ఫ్యాన్స్‌కు ఒకే రోజు రెండు పండుగల వస్తాయని చెప్పొచ్చు.

Guntur karam Movie First Song Release on October 24th

ఇదిలా ఉండగా.. 'గుంటూరు కారం' సినిమాను హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఇందులో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా చేస్తున్నారు. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇందులో ప్రకాశ్ రాజ్, జగపతిబాబు, జయరాం, రమ్యకృష్ణ సహా ఎంతో మంది కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమా జనవరి 12న రిలీజ్ అవబోతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X