గుంటూరు కారం నుంచి ఊహించని గిఫ్ట్.. ఫ్యాన్స్‌కు ఒకేసారి రెండు పండుగలు
టాలీవుడ్‌లో దర్శకుడు - హీరోకు సంబంధించి కొన్ని ప్రత్యేకమైన కాంబినేషన్లు ఉన్నాయి. ఆయా స్టార్ల కలయికలో సినిమాలు రావాలని ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియులంతా కోరుకుంటారు. అలాంటి కాంబోల్లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ - సూపర్ స్టార్ మహేశ్ బాబు జోడీ ఒకటి. 'అతడు', 'ఖలేజా' తర్వాత వీళ్లిద్దరూ చాలా గ్యాప్ తీసుకున్న విషయం తెలిసిందే.
దాదాపు పన్నెండేళ్ల తర్వాత మహేశ్ బాబు - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రాబోతున్న చిత్రమే 'గుంటూరు కారం'. పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాపై అంచనాలు ఏ రేంజ్‌లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వాటికి ఏమాత్రం తగ్గకుండా ఈ మూవీ తెరకెక్కిస్తున్నారు. ఇక, ఈ చిత్రం గుంటూరు మిర్చి యార్డ్ నేపథ్యంతో రూపొందుతోంది.

మహేశ్ బాబు కెరీర్‌లోనే ఎంతో క్రేజీగా రాబోతున్న ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ చాలా రోజుల క్రితమే ప్రారంభం అయింది. అయితే, మధ్యలో కొన్ని అనుకోని అవాంతరాలు, కొందరి డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో పాటు క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా షూటింగ్ సజావుగా సాగడం లేదు. దీంతో ఈ చిత్రం ఆగిపోతుందా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అయ్యాయి.
ఎన్నో ఆటంకాల తర్వాత 'గుంటూరు కారం' మూవీకి సంబంధించిన షూటింగ్ గత వారంలోనే పున: ప్రారంభం అయింది. ఇందులో ఓ ఆఫీస్ ఎపిసోడ్‌కు సంబంధించిన సీన్లను షూట్ చేశారు. అలాగే, ఇప్పడు యాక్షన్ సీక్వెన్స్ తీస్తున్నారు. ఇక, ఏమాత్రం బ్రేకులు లేకుండా చిత్రీకరణ జరిపి.. మహేశ్ బాబు సినిమాను సంక్రాంతికే రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ చాలా శ్రమిస్తోంది.
'గుంటూరు కారం' అప్‌డేట్ల కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కోసం తాజాగా ఓ క్రేజీ న్యూస్ లీకైంది. దీని ప్రకారం.. ఈ సినిమాలోని మొదటి పాటను వినాయక చవితి సందర్భంగా విడుదల చేయబోతున్నారట. ఇప్పటికే దీనికి సంబంధించిన వర్క్ మొత్తం కంప్లీట్ అయిందట. సెప్టెంబర్ మొదటి వారంలోనే ఈ పాటకు సంబంధించిన అనౌన్స్‌మెంట్ వస్తుందని సమాచారం.

ఇక, 'గుంటూరు కారం' సినిమాను హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఇందులో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా చేస్తున్నారు. థమన్ ఈ సినిమాకు సంగీతాన్ని ఇస్తున్నాడు. ఇందులో ప్రకాశ్ రాజ్, జగపతిబాబు, జయరాం, రమ్యకృష్ణ సహా ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమా జనవరి 12న రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది.


Click it and Unblock the Notifications











