Fire and Ice: జ్యోతీ పూర్వజ్ గ్లామర్ ఫైర్.. యాక్షన్‌తో సూపర్ కూల్.. కిల్లర్ పాటతో అదుర్స్!
టెలివిజన్ రంగంలో టాప్ యాక్టర్‌గా గుర్తింపు పొందడమే కాకుండా గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకొన్న నటి జ్యోతి పూర్వజ్ నటించిన తాజా చిత్రం కిల్లర్. ధ్యానం నాన్నగారు ఆశీస్సులతో థింక్ సినిమా, ఏయూ అండ్ ఐ స్టూడియోస్ బ్యానర్స్ పై పూర్వజ్, ఏ పద్మనాభ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి శుక్ర ఫేమ్ సుక్కు పూర్వజ్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఉర్వీశ్ పూర్వజ్ సమర్పిస్తున్న ఈ చిత్రంలో మనీష్ గిలాడ, చంద్రకాంత్ కొల్లు, విశాల్ రాజ్, అర్చన ఆనంత్, గౌతమ్ చక్రధర్ కొప్పిశెట్టి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ రిలీజై మంచి స్పందన కూడగట్టుకొన్నది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఈ చిత్రంలోని ఫైర్ అండ్ ఐస్ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ సాంగ్ గురించిన వివరాల్లోకి వెళితే..

జ్యోతి రాయ్ అలియాస్ జ్యోతి పూర్వజ్‌గా కన్నడ, తెలుగు ప్రేక్షకులకు పరిచయమై.. ప్రస్తుతం క్రిమినల్ సినిమా కోసం పూర్తిగా శరీరాకృతిని పూర్తిగా మార్చుకొని హీరోయిన్ ఓరియెంటెడ్ పాత్రలో యాక్షన్ థ్రిల్లర్ సినిమాతో ఆమె ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమాలోని ఆమె పాత్రను తెలియజెప్పే పాటను తాజాగా మీడియాకు ప్రదర్శించి.. సాధారణ ఆడియెన్స్‌కు అందుబాటులోకి తీసుకొచ్చారు.
ఫైర్ అండ్ ఐస్ లిరికల్ వీడియో విషయానికి వస్తే.. ఈ పాటను దర్శకుడు పూర్వజ్ స్వయంగా రాశారు. ఈ పాటకు ఆశీర్వాద్ సంగీతం అందించారు. ర్యాప్‌గా సాగే ఈ పాటను జాసన్ జోసెఫ్ ఆలపించారు. డీ సుమన్ మ్యూజిక్ సహకారం అందించారు. ఈ పాటలో జ్యోతి పూర్వజ్ యాక్షన్ సన్నివేశాలు, గ్లామర్ సీన్లను జొప్పించారు. జ్యోతి పూర్వజ్ చేసిన ఫైట్స్ ఆకట్టుకొనేలా ఉన్నాయి.

ఈ చిత్రంలో జ్యోత పూర్వజ్ స్పై, వాంపైర్, సూపర్ షీ, టెర్రరిస్ట్, రక్షా రై ఐదు భిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ పాత్రకు సంబంధించిన లుక్స్‌ను ఈ పాట ద్వారా పరిచయం చేశారు. ఈ పాట విడుదలైన కొద్ది గంటల్లోనే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్ర కథా నేపథ్యం ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ ఎలిమెంట్స్ ముడిపడి ఉంటాయి. సైన్స్ ఫిక్షన్ అంశాలతో రూపుదిద్దుకొన్నది. ఈ చిత్రం సైన్స్ ఫిక్షన్ జోనర్‌లో ట్రెండ్ సెట్టర్ అవుతుంది అని దర్శకుడు పూర్వజ్ అభిప్రాయపడ్డారు.
మా కిల్లర్ టీమ్ డివైన్‌గా చేసిన మూవీ. ఒక ప్యాషన్‌తో ప్రతీ డిపార్ట్‌మెంట్ ఎంతో కష్టపడి చేశారు. నేను స్పెషల్ గా థ్యాంక్స్ చెప్పాలంటే మా పూర్వజ్ సుక్కుసార్‌కి చెపుతాను. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. ఒక పనిని ఇష్టపడి కష్టపడి చేస్తే నష్టమనేది ఉండదు అని నమ్మే వ్యక్తి సుక్కుసార్. సినిమా గురించి ఎంత చెప్పినా ఏమి చెప్పినా గంటలు తరబడి కూర్చుని ఓపికగా పని చేస్తారు. ఆ ప్రతిఫలమే కిల్లర్ మూవీ. ఇది ఒన్ మ్యాన్ షో అని చెప్పాలి. అదే విధంగా జ్యోతిగారి గురించి కూడా అందరూ మాట్లాడుకుంటారు. ఈ మూవీ తరువాత ఈ పేరు చాలా గట్టిగా వినపడుతుంది అని యాక్టర్‌కమ్, లైన్‌ప్రొడ్యూసర్ దశరధ్ మాధవ్ ఎమోషనల్ అయ్యారు.


Click it and Unblock the Notifications











