Hi Nanna Movie: హాయ్ నాన్న నుంచి మరో పాట వచ్చేసింది.. నాని, మృణాల్ లవ్ స్టోరీ మొత్తం చూపించేశారుగా!
Ammaadi Song: న్యాచురల్ స్టార్ నాని హీరోగా, మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా రాబోతున్న తాజా చిత్రం హాయ్ నాన్న. ఈ సినిమా గురించి అందరికీ తెలిసిందే. శౌర్యువ్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా గురించి ప్రకటించినప్పటి నుంచే ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి రేకెత్తింది. ముఖ్యంగా ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్ డేట్ వచ్చినా క్షణాల్లోనే వైరల్ గా మారుతుంటుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రెండు లిరికల్ సాంగ్స్ విడుదల కాగా... వాటికి అనూహ్య స్పందన వచ్చింది. సమమయా.. సమయమా అంటూ సాగే మొదటి పాటకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఆ పాటలో నాని, మృణాల్ ఠాకూర్ ల మధ్య ప్రేమను చాలా చక్కగా చూపించారు.
ఇక రెండో లిరికల్ సాంగ్ గాజు బొమ్మ కూడా అదిరిపోయింది. అందులో నాని, తన కూతురు మధ్య బాండింగ్ ను మరింత అద్భుతంగా ఆవిష్కరించారు. తాజాగా చిత్రబృందం మరో లిరికల్ పాటను విడుదల చేసింది. అమ్మాడి అంటూ సాగే ఈ పాటలో హీరోహీరోయిన్ల ప్రేమాయణం, పెళ్లి, ఆ తర్వాత వారి ప్రయాణాన్ని చాలా చక్కగా చూపించారు. ఈ పాటకు తగ్గట్లుగా విజ్యువల్స్.. నాని, మృణాల్ రొమాన్స్ నిజంగా అదిరిపోయాయి. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా పండింది. ఈ ఒక్క సాంగ్ చూస్తే వీరిద్దరి మధ్య ఉన్న లవ్ స్టోరీ మొత్తం తెలిసిపోతుంది.

ముందుగా మృణాల్ ఠాకూర్ లైవ్ మ్యూజిక్ పెర్ఫార్మెన్స్ తో ఈ పాట మొదలవుతుంది. అయితే తన భర్త గురించి చెబుతూ.. ఆమె పాట పాడుతూ కనిపించింది. ముఖ్యంగా ఈ పాటను తన భర్తకు డెడికేట్ చేస్తున్నానని.. ఈరోజు తన మూడో పెళ్లి రోజని చెబుతుంది. ఆ తర్వాత పాట పాడడం ప్రారంభిస్తుంది. ఇక ఆ తర్వాత తనను రోజూ పిలిచే విధానం, వారి మధ్య సాగే బంధం గురించి చక్కగా పాడుతుంది. ఈక్రమంలోనే నాని, మృణాల్ మధ్య జరిగిన ప్రేమాయణాన్ని విజ్యువల్ రూపంలో చూపించారు. మొదటి రెండు పాటల్లాగానే ఈ పాట కూడా అదిరిపోయింది.
అబ్దుల్ వాహబ్ సంగీతానికి అందరూ ఫిదా అయిపోతున్నారు. అలాగే కృష్ణకాంత్ రాసిన ఈ లిరిక్స్ కూడా చాలా బాగున్నాయి. కాల భైరవ, శక్తి శ్రీ గోపాలన్ లు పాడిని ఈ పాట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఈరోజు విడుదల అయిన ఈ పాట విన్న నాని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. పాటలే ఈ రేంజ్ లో ఉంటే ఇంకా సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదంటూ కామెంట్లు చేస్తున్నారు.
వైరా ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై మోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అలాగే నాని, మృణాల్ ఠాకూర్ ల కూతురుగా బేబీ కియారా కన్నా కనిపించబోతుంది. ప్రవీణ్ ఆంటోని ఎడిటింగ్ బాధ్యతలు చూసుకుంటుండగా.. అవినాశ్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ గా వ్యవహరిస్తున్నారు. డిసెంబర్ ఏడో తేదీన తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. చూడాలి మరి ఈ చిత్రం ఏం రేంజ్ లో ఆకట్టుకుంటుందో.


Click it and Unblock the Notifications











