‘లైఫ్‌లో మజా కోసం’ అంటూ రచ్చ.. బిగ్ బాస్ బ్యూటీతో హర్భజన్ సింగ్ చెట్టాపట్టాల్
క్రికెటర్ హర్భజన్ సింగ్ నటుడిగా మారుతున్న సంగతి తెలిసిందే. తమిళ్ బిగ్ బాస్ మూడో సీజన్ బ్యూటీ లాస్లియాతో జంట కడుతూ హర్భజన్ దుమ్ములేపుతున్నాడు. ఫ్రెండ్ షిప్ అంటూ రాబోతోన్న ఈ మూవీని ఆర్.కె ఎంటర్ టైన్మెంట్స్ సమర్పణలో శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ పతాకంపై ఏ.ఎన్. బాలాజీ నిర్మిస్తున్నాడు. 'జాన్ పాల్ రాజ్-శ్యామ్ సూర్య' సంయుక్తంగా దర్శకత్వం వహించారు.
ఇప్పటికే వదిలిన పాటలు, పోస్టర్లు సినిమాపై మంచి అంచనాలను క్రియేట్ చేశాయి. అంతే కాకుండా ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్ కూడా నటిస్తుండటంతో మరింత హైప్ ఏర్పడింది. ప్రముఖ తమిళ నిర్మాత జె.సతీష్ కుమార్ (జెఎ స్ కె) విలన్ గా నటిస్తుండటం మరో విశేషం. అంతే కాకుండా ఈ చిత్రానికి భారీ బడ్జెట్ కేటాయించడం మరో విశేషం. దాదాపు 25 కోట్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తోన్నట్టు తెలుస్తోంది.

డి.ఎం.ఉదయ్ కుమార్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ఓ పాట తాజాగా విడుదలై దూసుకుపోతోంది. 'లైఫ్ లో మజా కోసం' అంటూ విడుదల చేసిన లిరికల్ వీడియో ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. హర్భజన్, లాస్లియా కలిసి చేసిన అల్లరి బాగానే ఆకట్టుకుంటోంది. లహరి మ్యూజిక్ లో ఈ పాట విడుదల కాగా ఈ పాటను శరత్ సంతోష్ పాడారు. ప్రస్తుతం ఈ లిరికల్ వీడియో యూట్యూబ్ దుమ్ములేపుతోంది.


Click it and Unblock the Notifications











