టాలీవుడ్ లోకి మరో బాలీవుడ్ సంస్థ ఎంట్రీ.. ఫాన్సీ రేట్ కు హరిహర వీరమల్లు ఆడియో రైట్స్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక పక్క ఏపీలో రాజకీయాలు చూసుకుంటూనే మరో పక్క సినిమాల్లో కూడా నటిస్తున్నాడు. ఇప్పటికే ఆయన నటించిన వకీల్ సాబ్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పటికే ఆయన మరో నాలుగు సినిమాలకు ఓకే చెప్పాడు. అయితే అందులో ఒకటైన హరిహర వీరమల్లు సినిమా ఆడియోకు అదిరిపోయే రేటు వచ్చిందని అంటున్నారు. ఆ వివరాలు

అధిక ధరలకు
తెలుగు చిత్ర పరిశ్రమలోకి బాలీవుడ్ సంగీత సంస్థలు దూసుకుపోతున్నాయి. 'శ్యామ్ సింఘ రాయ్' మరియు ఇతర చిత్రాల సంగీత హక్కులను అధిక ధరలకు సరిగమ దక్కించుకుంది. ప్రభాస్ చేయబోయే అన్ని సినిమాల సంగీత హక్కులు T సిరీస్ కొనుగోలు చేసింది. ఇప్పుడు, ఇతర సంగీత సంస్థలు పెద్ద సినిమా ఆడియో రైట్స్ కొనుక్కుంటున్నాయి.

ఫ్యాన్సీ రేటు చెల్లించి
బాలీవుడ్‌లో ప్రముఖ ఆడియో లేబుల్ అయిన టిప్స్ ఇండస్ట్రీస్, తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న రెండు చిత్రాల గ్లోబల్ మ్యూజిక్ హక్కులు ఫ్యాన్సీ రేటు చెల్లించి సొంతం చేసుకుంది. అవి పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ 'హరి హర వీర మల్లు' మరియు గుణశేఖర్ డైరెక్షన్లో సమంత నటించిన 'శాకుంతలం'. రెండు సినిమాలూ పీరియాడికల్ డ్రామాలే. క్రిష్ దర్శకత్వం వహించిన 'హరి హర వీరమల్లు' చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. 'శాకుంతలం' చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్ జంటగా
పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. కానీ గుణశేఖర్ పీరియడ్ డ్రామా చాలా కాలం క్రితం షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకుంది. జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్ల సినిమా షూటింగ్ దశలో ఉంది. మొగల్స్ మరియు కుతుబ్ షాహిస్ శకం నేపథ్యంలో 17 వ శతాబ్దంలోనే ఈ సినిమా కధ ఉండనుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద ముందు నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్ జంటగా నటిస్తుండగా.. అర్జున్ రాంపాల్ ముఖ్యపాత్ర పోషిస్తున్నారు.

భారీ రేటు వెచ్చించి
తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ఏప్రిల్ నెలలో గ్రాండ్‌గా ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఈ మూవీ మ్యూజిక్ హక్కులు ఇప్పుడు టిప్స్ ఇండస్ట్రీస్ సొంతమయ్యాయి. భారీ రేటు వెచ్చించి మరీ ఈ సినిమా హక్కులను సంస్థ సంపాదించింది. అలాగే కాళిదాసు రచించిన ప్రముఖ భారతీయ నాటకం శకుంతల ఆధారంగా భారతీయ తెలుగు భాషా పౌరాణిక ప్రేమకథా చిత్రంగా శాకుంతలం మూవీ రూపొందింది.

శాకుంతలం కూడా
క్రెయేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను గుణ టీమ్‌వర్క్స్, దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నీలిమ గుణ, దిల్ రాజు నిర్మించారు. మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్రంలో సమంత లీడ్ రోల్ పోషించగా.. కురు వంశపు రాజు దుష్యంతుడిగా మలయాళ నటుడు దేవ్ మోహన్ నటించారు. మోహన్ బాబు, సచిన్ ఖేడేకర్, గౌతమి, అదితి బాలన్, అల్లు అర్హ, అనన్య నాగళ్ళ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా మ్యూజిక్ హక్కులు కూడా ఇప్పుడు టిప్స్ మ్యూజిక్ కంపెనీ చేజిక్కించుకుంది.


Click it and Unblock the Notifications











