Hebah Patel.. యువ హీరోతో ఫుల్ రొమాంటిక్‌గా హెబ్బా పటేల్.. గ్లామర్ డోస్ పెంచిన బ్యూటీ

తెలుగు సినిమా పరిశ్రమలో టాలెంటెడ్ హీరోయిన్లలో హెబ్బా పటేల్ ఒకరంటే ఎలాంటి సందేహం అక్కర్లేదు. కెరీర్ ఆరంభంలో వరుస హిట్లతో లక్కి హీరోయిన్‌గా పేరు తెచ్చుకొన్నది. అయితే కెరీర్ గ్రాఫ్ భారీగా ఉన్నదనుకొన్న సమయంలోనే అవకాశాలు తగ్గిపోయి సినిమాలకు దూరమైంది. అయితే వచ్చిన అవకాశాలను వదులకొని తన స్థానాన్ని నిలబెట్టుకొనే ప్రయత్నం చేస్తున్నది. ఆ క్రమంలో ప్రస్తుత సందేశం అనే వినూత్న కథా చిత్రంలో నటించే ప్రయత్నం చేస్తున్నది. ఈ చిత్రంలోని రొమాంటిక్ పాటలో కనిపించిన దృశ్యం వైరల్ అయింది. ఈ సినిమా గురించి, హెబ్బా పటేల్ కెరీర్ గురించిన విషయాల్లోకి వెళితే..

గ్లామర్ హీరోయిన్‌గా రాణించిన హెబ్బా పటేల్.. చటుక్కున మాయమైంది. ఇటీవల వ్యవస్థ అనే వెబ్ సిరీస్‌లో పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకొన్నది. మళ్లీ తన కెరీర్‌ను గాడిన పడేసేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నది. స్పెషల్ సాంగ్స్, పాత్ర ప్రాధాన్యం ఉన్న చిత్రాల్లో నటించేందుకు ప్రయత్నం చేస్తున్నది. ఈ క్రమంలోనే సందేశం చిత్రంలో నటిస్తున్నది.

 Hebah Patel

హెబ్బా పటేల్ నటిస్తున్న సందేశం సినిమాను విష్ణు వర్షిణి క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందుతున్నది. పర్చ సత్యనారాయణ నిర్మిస్తున్న ఈ సినిమాకు షీ బిలీవ్డ్ అనే ట్యాగ్‌లైన్. ఊరికి ఉత్తరాన సినిమాతో ప్రశంసలు అందుకొన్న సతీష్ పరమవేద ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో సుమన్ ఊటకురు, హెబ్బా పటేల్ జంటగా నటిస్తున్నారు.

సందేశం సినిమా నుంచి ఇప్పటికే రెండు పాటలు రిలీజై మంచి స్పందనను సొంతం చేసుకొన్నది. సుభాష్ ఆనంద్ సంగీతం అందిస్తున్న పాటలు సోషల్ మీడియాలో మంచి ఆదరణను పొందుతున్నాయి. ఈ ఈ క్రమంలో ఈ సినిమాలోని మనసే మారాలా అనే మూడో పాటను కూడా రిలీజ్ చేశారు. ఈ పాటను ఎస్పీ చరణ్, కే ప్రణతి ఆలపించారు. ఇటీవల కాలంలో మంచి సాహిత్యంతో పేరు తెచ్చుకొన్న పూర్ణాచారి పాటను రాయడం గమనార్హం.

మనసే మారాలా పాట రొమాంటిక్ సాగుతూ యువతను గిలిగింతలు పెట్టేలా ఉందనిపిస్తుంది. మెలోడిగా సాగుతూ సంగీత ప్రియులను ఆకట్టుకొనేలా ఉంది. ఈ పాటలో సుమన్, హెబ్బా చాలా రొమాంటిక్‌గా కనిపించారు. ఈ పాటకు సంబంధించిన విజువల్స్ కూడా రొమాంటిక్‌గా కనిపించాయి. ఈ క్రమంలో హెబ్బా హీరోయిన్‌గా మరోసారి రెచ్చిపోయి గ్లామర్ పంట పడించిందనే అభిప్రాయం అభిమానుల్లో కలుగుతున్నది.

 Hebah Patel

నటీనటులు: హెబ్బా పటేల్, సుమన్, శ్వేతా వర్మ, రాశిక శెట్టి, శుభ శ్రీ రాయగురు, శ్రీనివాస్ భోగిరెడ్డి, సుందర్ రావు పర్చా, చంద్రశేఖర్ తదితరులు
దర్శకత్వం: సతీష్ పరమవేద
సినిమాటోగ్రఫి: ప్రవీణ్ వనమాలి
ఎడిటర్: సురేష్ దుర్గం
నిర్మాత: పర్చ సత్యనారాయణ
మ్యూజిక్: సుభాష్ ఆనంద్
లిరిక్స్: పూర్ణాచారి
కొరియోగ్రఫి: అనీష్ బాబు

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X