twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    RRR దోస్తీ సాంగ్ పై క్లారిటీ ఇచ్చిన సింగర్ హేమచంద్ర...మైండ్ బ్లోయింగ్, పాట మొదట్లోనే ఒత్తిడికి లోనయ్యా అంటూ..

    |

    టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా దేశవ్యాప్తంగా భారీ అంచనాలతో రూపొందుతున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ RRR కోసం అభిమానులే కాకుండా ఎంతో మంది సినీ ప్రముఖులు ఎదురుచూస్తున్నారు. ఇక సినిమా అసలైన సందడి మొదలైంది. ముందుగానే దర్శకుడు ఫస్ట్ లుక్ టీజర్స్ తోనే సాలీడ్ బజ్ క్రియేట్ చేయగా ఇప్పుడు మ్యూజిక్ ప్రమోషన్ భారాన్ని సంగీత దర్శకుడు కీరవాణి మోస్తున్నారు. ఇక మొదటి సాంగ్ సాంగ్ పై సింగర్ హేమచంద్ర ఒక వీడియో బైట్ లో క్లారిటీ ఇచ్చాడు.

    Recommended Video

    RRR Movie Streaming Details, బిజినెస్ 1200 కోట్ల పైనే || Filmibeat Telugu
    మరో లెవెల్ కు తీసుకువెళ్లబోతున్నారు

    మరో లెవెల్ కు తీసుకువెళ్లబోతున్నారు

    రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న ఈ బిగ్ మల్టీస్టారర్ ప్రాజెక్ట్ లో అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ పాత్రలు ఏ స్థాయిలో ఉంటాయో ఊహలకు కూడా అందడం లేదు. ఇక వారిద్దరి మధ్యలో ఉండే స్నేహాన్ని జక్కన్న అద్భుతంగా ప్రజెంట్ చేయగా సంగీత దర్శకుడు కీరవాణి తన పాటతో మరో లెవెల్ కు తీసుకువెళ్లబోతున్నారు.

    5 మంది సింగర్స్ తో..

    5 మంది సింగర్స్ తో..

    ముందుగా ఆగస్ట్ 1న ఫ్రెండ్షిప్ డే సందర్భంగా దోస్తీ అనే పాటను విడుదల చేయబోతున్నారు. ఈ పాటను 5 భాషల్లో డిఫరెంట్ సింగర్స్ తో పాడించారు. పాట కోసం ప్రత్యేకంగా మేకింగ్ వీడియోను కూడా చేశారు. ఇక తెలుగులో హేమచంద్ర పాడగా, తమిళ్ లో అనిరుధ్ రవిచంద్రన్, ఇక హిందీలో అమిత్ త్రివేది, మళయాళంలో విజయ్ యేసుదాస్, కన్నడలో యాజిన్ నిజార్ వంటి టాలెంటెడ్ గాయకులు ఆలపించారు.

    నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది..

    ఇక ఇటీవల సింగర్ హేమచంద్రతో ఒక వీడియోను రిలీజ్ చేయించారు. అందులో ఈ సింగర్ పాట గొప్పతనం గురించి చెప్పాడు. హేమచంద్ర మాట్లాడుతూ.. మొదటిసారి కీరవాణి - రాజమౌళి కాంబినేషన్ లో పాట పాడాను. ఇది నాకొక డ్రీమ్. నేను మాటల్లో చెప్పలేకపోతున్నాను. సాంగ్ మొదలైనప్పటి నుంచి మేకింగ్ షూట్ జరిగే వరకు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది.. అని అన్నారు.

    ఇంకాస్త ఎక్కువ ఒత్తిడి ఉండేది

    ఇంకాస్త ఎక్కువ ఒత్తిడి ఉండేది

    ప్రతి పాట పాడేముందు ఈ సాంగ్ మనం సరిగ్గా పాడతామా లేదా అనే టెన్షన్ ఉంటుంది. ఇక ఈ బిగ్గెస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ విషయంలో నాకు ఇంకాస్త ఎక్కువ ఒత్తిడి ఉండేది. అంతే కాకుండా ప్రమోషనల్ షూట్ అనేసరికి షాక్ అయ్యాను. సాంగ్ ను షూట్ చేసిన విధానం అయితే మైండ్ బ్లోయింగ్. సీతారామశాస్త్రి రాసిన లిరిక్స్ కూడా బ్యూటీఫుల్ అనే చెప్పాలి. ప్రతి ఒక్క లైన్ చాలా బాగా కనెక్ట్ చేశారు. ఓవరాల్ గా ఒక బిగ్ ప్యాకేజ్ ఇది.. అని హేమచంద్ర వివరణ ఇచ్చారు.

    English summary
    It is a well known fact that Bahubali is the film that has the true meaning of the word Pan India. The upcoming RRR movie with the same team is also going to take the Pan India range to another level. Songs stand as another weapon for any movie. A music director like Keeravani has decided to release each song in a range. While releasing the first Dosti song in 5 languages, Singer set the language
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X