Dil Ka First Beat సెల్ఫీష్ మూవీలో తొలి పాట ట్రెండింగ్.. యువ హీరో ఆశీష్ క్రేజీగా స్టెప్పులు!
ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఫ్యామిలీ నుంచి వచ్చిన సినీ వారసుడు,యువ హీరో ఆశీష్ నటించిన కొత్త చిత్రం సెల్ఫీష్ మూవీ రిలీజ్‌కు సిద్దమైంది. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా హీరో ఆశీష్ పుట్టిన రోజును పురస్కరించుకొని తొలి పాటను రిలీజ్ చేశారు. దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రం తొలి పాట గురించిన వివరాల్లోకి వెళితే..
సెల్ఫీష్ సినిమా పోస్టర్‌లో ఆశీష్ లుక్ అందర్నీ ఆకట్టుకొంటున్నది. మాస్ లుక్‌తో కేర్ లెస్‌గా ఉన్న యాటిట్యూడ్ కొత్తగా యూత్‌ను ఎట్రాక్ట్ చేస్తున్నది. అయితే తాజాగా దిల్ కా ఫస్ట్ బీట్ పాటను రిలీజ్ చేశారు. హీరోయిన్ ఇవానాను దిల్ కా ఫస్ట్ బీట్ అంటూ ఆటపట్టిస్తూ హీరో పాడుకొనే పాటగా ఉంది. ఈ పాటను సరస్వతిపుత్ర రామజోగయ్య శాస్త్రీ రచించారు.

దిల్ కా ఫస్ట్ బీట్ పాటకు మెలోడి స్పెషలిస్ట్ మిక్కీ జే మేయర్ అద్బుతమైన బీట్స్‌ను అందించారు. ఈ పాటను ప్రముఖ గాయకుడు జావెద్ అలీ ఆలపించారు. ఈ పాట విడుదల కాగానే అన్ని వర్గాలను ఆకట్టుకొంటూ మ్యూజిక్ చార్ట్‌లో టాప్ స్థానంలో చేరింది. ఈ పాటలో ఆశీష్ చేసిన డ్యాన్సులు, వేసిన స్టెప్పులు ప్రేక్షకుల చేత ఈలలు కొట్టించేలా ఉంటాయి అని చిత్ర యూనిట్ పేర్కొన్నది. ఈ పాటకు భాను మాస్టర్ కొరియోగ్రఫిని అందించారు.
సెల్ఫీష్ సినిమాను హర్షిత్ రెడ్డి, హన్షితా రెడ్డి సహ నిర్మాతలుగా నిర్మిస్తున్నారు. అశోక్ బండ్రెడ్డి ఎగ్జిక్యూటివ్‌గా వ్యవహరిస్తున్నారు. జే యువరాజ్ సినిమాటోగ్రఫిని, ప్రవీణ్ పూడి ఎడిటింగ్ బాధ్యతలను నిర్వహించారు.ఈ సినిమాకు కిరణ్ కుమార్ మన్నె ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.
నటీనటులు: ఆశీష్, ఇవానా తదితరులు
రచన, దర్శకత్వం: కాశీ విశాల్
నిర్మాతలు: దిల్ రాజు, శిరీష్
సినిమాటోగ్రఫి: యువరాజ్ జే
మ్యూజిక్: మిక్కీ జే మేయర్
ఆర్ట్ డైరెక్టర్: కిరణ్ కుమార్ మన్నె
పీఆర్వో: మధు,వంశీ శేఖర్


Click it and Unblock the Notifications











