అప్పుడు మాస్ ఇప్పుడు రొమాన్స్.. హీరో కార్తికేయ రచ్చ!

ప్రస్తుతం హీరో కార్తికేయ మాస్ ప్రేక్షకులను మెప్పించేందుకు రెడీ అవుతున్నాడు. అందుకు తగ్గట్టు బస్తీ బాలరాజు అంటూ చావు కబురు చల్లగా సినిమాలో అదరగొడుతున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన మై నేమ్ ఈజ్ రాజు అనే మాస్ నంబర్ యూట్యూబ్‌లో ట్రెండ్ అయింది. అయితే ఈ సినిమాలోని పోస్టర్లు, టీజర్‌లు అందరినీ ఆకట్టుకున్నాయి. మాస్ సాంగ్ కూడా ఆకట్టుకుంటుంది.

అయితే ఇక ఇప్పుడు ఇందులోని రొమాంటిక్ టచ్‌ను కూడా బాలరాజు ఇచ్చేందుకు రెడీ అయ్యాడు. ఈ మేరకు హీరో కార్తికేయ ఓ ట్వీట్ వేశాడు. మల్లికతో ప్రేమాయణాన్ని మొదలుపెట్టిన బస్తీ బాలరాజు ఇప్పుడు తన ప్రేమగాథను వివరించేందుకు వస్తున్నట్టున్నాడు. రొమాంటిక్ సింగిల్‌ను విడుదల చేయబోతోన్నట్టు ప్రకటించేశాడు. పోస్టర్ చూస్తుంటే మల్లికతో బాలరాజు మంచి మూడ్‌లో ఉన్నట్టు కనిపిస్తున్నాడు.

 Hero karthikeya about Romantic 2nd single from Chaavu Kaburu Challaga

చావు కబురు చల్లగా నుంచి మాస్ నంబర్ అయిన మై నేమ్ ఈజు రాజు అనే పాట మీ అందరికీ నచ్చింది.. ఇక ఇప్పుడు కదిలే కాలాన్నడిగా అంటూ ఓ మెలోడి రాబోతంది. ఫిబ్రవరి 23న సాయంత్రం నాలుగు గంటల ఐదు నిమిషాలకు విడుదల కాబోతోంది. అది కూడా మీ అందరికీ నచ్చుతుందనే ఆశిస్తున్నామంటూ చెప్పుకొచ్చాడు. సినిమా విడుదలకు సమయం దగ్గర పడుతున్నా కొద్ది ఇలా ప్రమోషన్ కార్యక్రమాలను పెంచేస్తున్నారు. మార్చి 19న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

అందాల ఆరబోత.. నైనా గంగూలీ పిక్స్ వైరల్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X