Shekar Movie: యాంగ్రీ స్టార్ రాజశేఖర్ సరికొత్త లవ్ యాంగిల్.. ఫస్ట్ సాంగ్ తోనే పాజిటివ్ బజ్

తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న యాంగ్రీ స్టార్ రాజశేఖర్ ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద వరుస విజయాలను అందుకున్న వారే. అయితే చాలా కాలంగా ఆయన సరైన సక్సెస్ లేక కాస్త బాక్సాఫీస్ వద్ద వెనుకబడి ఉన్నారు. సినిమా ఇండస్ట్రీ లో ఏదో ఒక విషయంలో ఆయన నిత్యం హడావిడి గా కనిపిస్తూనే ఉన్నారు. ఆ మధ్యకాలంలో మా అధ్యక్ష ఎన్నికల్లో ప్రత్యక్షమైన విషయం తెలిసిందే. అంతేకాకుండా మెగాస్టార్ చిరంజీవి తో కూడా మధ్యలో విభేదాలు వచ్చినట్లు చాలా క్లారిటీ గా అర్థమైంది. ఇక వివాదాలు ఎన్ని ఉన్నా కూడా రాజశేఖర్ మాత్రం తనదైన శైలిలో సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. కేవలం రొటీన్ కమర్షియల్ సినిమాలే కాకుండా ప్రయోగాత్మకమైన సినిమాలు చేసేందుకు కూడా రాజశేఖర్ ఆసక్తిని చూపిస్తున్నారు. కొత్త దర్శకులకు అవకాశం ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అయితే ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా కూడా రాజశేఖర్ బాక్సాఫీస్ వద్ద సరైన సక్సెస్ అవ్వడం లేదు.

మూడేళ్ల క్రితం గరుడవేగ సినిమాతో పర్వాలేదనిపించినా రాజశేఖర్ ఆ తర్వాత కల్కి సినిమాతో కూడా ఊహించని విధంగా డిజాస్టర్ ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక ఈ సారి ఎలాగైనా మంచి సక్సెస్ అందుకోవాలని 'శేఖర్' అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. రాజశేఖర్ కు ఇది 91వ సినిమా కావడం విశేషం. అయితే జీవిత రాజశేఖర్ ఈ సినిమా కోసం నిర్మాత గానే కాకుండా దర్శకత్వం కూడా వహించారు. నిజ జీవితంలో జరిగిన కొన్ని రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు సమాచారం.

Hero rajashekar shekar movie first song update

అయితే విడుదలైన సినిమా ఫస్ట్ టీజర్ తోనే మంచి క్రేజ్ వచ్చింది. ఇక ఇప్పుడు సినిమాలోని మొదటి పాటను కూడా విడుదల చేశారు.. లవ్ గంటే మోగింది అంటూ రాజశేఖర్ చాలా కొత్తగా పాటలో కనిపిస్తున్నారు. తన లవ్ స్టోరీ గురించి చెబుతూ అందులోని విభిన్నమైన అంశాలను కూడా గుర్తు చేసుకుంటున్న హీరోగా రాజశేఖర్ పాటలో కనిపిస్తున్నారు. ఇక ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందించగా లవ్ గంటే పాటను రేవంత్ విజయ్ ప్రకాష్ అనూప్ రూబెన్స్ ఆలపించారు. ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్ రచించిన ఈ పాట సినిమాకు తగ్గట్టుగా సందర్భానుసారంగా వస్తాయని విజువల్స్ చూస్తేనే అర్థమవుతుంది. ఇక ఈ సినిమాలో రాజశేఖర్ సరికొత్తగా ప్రేక్షకులను అలరించబోతున్నారని సమాచారం.

ఇక సినిమాను ఈ ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకున్నారు. మరి ఈ సినిమాతో రాజశేఖర్ బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో విజయాన్ని అందుకుంటుందో చూడాలి. అంతే కాకుండా రాజశేఖర్ మరో రెండు సినిమాలను కూడా లైన్ లో పెట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆ రెండు సినిమాలపై కూడా అఫీషియల్గా క్లారిటీ ఇవ్వనున్నట్లు సమాచారం. పెగాసస్ సినీ కార్ప్, టారస్ సినీ కార్ప్, సుధాకర్ ఇంపెక్స్ ఐపీఎల్, త్రిపురా క్రియేషన్స్ పతాకాలపై బీరం సుధాకర్ రెడ్డి, అలాగే రాజశేఖర్ కూతుళ్లు శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్ కూడా సినిమా నిర్మాణంలో భాగం అవుతున్నారు. వెంకట శ్రీనివాస్ బొగ్గరం సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X