చిరు, పవన్, ఎన్టీఆర్ దారిలో.. అదరగొట్టేసిన రామ్!
హీరోలు పాటలు పాడడం తొలినాళ్ళ నుంచి ఉన్న ట్రెండే. కానీ అది అప్పుడప్పుడూ మాత్రమే జరుగుతూ ఉంటుంది. తమ చిత్రాలలో హుషారెత్తించే పాటలు పాడిన హీరోల జాబితాలో హీరో రామ్ కూడా చేరిపోయినట్లు తెలుస్తోంది. రామ్ ప్రస్తుతం హలో గురు ప్రేమ కోసమే జీవితం అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో రామ్ అదిరిపోయే సాంగ్ పాడాడని జోరుగా వార్తలు వస్తున్నాయి.
ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. రామ్ చేత సాంగ్ పాడించాలనే ఐడియా దేవిశ్రీదే అట. మొదట రామ్ ఈ ప్రతిపాదనకు నిరాకరించాడట. దేవీశ్రీ పట్టు పట్టడంతో పాటని పలు మార్లు ప్రాక్టీస్ చేసి పడినట్లు తెలుస్తోంది. దేవిశ్రీ సలహాలతో రామ్ అదరగొట్టేసినట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి.
పోల్: బిగ్‌బాస్ తెలుగు 2 విజేతను మీరే తేల్చేయండి.. మీ ఓటు వేసేందుకు లింక్ క్లిక్ చేయండి!

అప్పుడప్పుడూ స్టార్ హీరోలు ఇలాంటి సాహసాలు చేస్తూనే ఉంటారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ వంటి హీరోలు ఇప్పటికే తమ చిత్రాలలో హుషారెత్తించే పాటలు పాడిన అనుభవం సంపాదించారు. ఇటీవల బాలయ్య కూడా పైసా వసూల్ చిత్రంలో సాంగ్ పాడాడు. ఆ జాబితాలోకి ఇప్పుడు రామ్ చేరబోతున్నాడు.


Click it and Unblock the Notifications











