అలవాటు లేని పని చేస్తున్న రామ్, ప్రకాష్ రాజ్!
హీరో రామ్ నటిస్తున్న తాజా చిత్రం హలో గురు ప్రేమ కోసమే. నేను లోకల్ ఫేమ్ త్రినాథ్ రావు నక్కిన దర్శత్వంలో ఈ చిత్రం రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోంది. రామ్ ఈ చిత్రంపై భారీగా ఆశలు పెట్టుకుని ఉన్నాడు. అనుపమ పరమేశ్వరన్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.
ఇటీవల విడుదలైన రొమాంటిక్ టీజర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. నేను శైలజ, ఉన్నది ఒక్కటే జిందగీ వంటి రామ్ చిత్రాలకు అదిరిపోయే ఆల్బమ్స్ అందించిన రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి కూడా సంగీత అందిస్తున్నాడు. ఈ చిత్రంలో రామ్ చేత దేవిశ్రీ ప్రసాద్ ఓ పాట పాడించనున్నాడు అని ఇటీవల వార్తలు వచ్చాయి.

ఇందులో మరో విశేషం కూడా ఉంది. రామ్ ఒక్కడే పాడడం లేదు. ప్రకాష్ రాజ్, రామ్ కలసి ఓ పాట పాడనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ చేస్తున్న ఈ ప్రయోగం ఆసక్తికరంగా మారింది. ఈ పాట గురించి ఆడియన్స్ లో ఆసక్తి నెలకొంది. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దసరా కానుకగా హలో గురు ప్రేమ కోసమే చిత్రాన్ని అక్టోబర్ 18 న విడుదల చేయనున్నారు.


Click it and Unblock the Notifications











