యూట్యూబ్‌లో రెడ్ పాటల హంగామా.. హీరో రామ్ ‘డించక్’ మరో రికార్డు!
సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటించిన 'రెడ్' చిత్రం యూట్యూబ్‌లో కొత్త మైలురాయిని అందుకొన్నది. తిరుమల కిశోర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై 'స్రవంతి' రవి కిషోర్ నిర్మించిన చిత్రానికి సంబంధించిన పాటలు ఇప్పటికే అత్యంత ప్రేక్షకాదరణ పొందాయి. నివేదా పేతురాజ్ , మాళవికా శర్మ, అమృతా అయ్యర్ ఇందులో కథానాయికలుగా నటించగా మరో యువ హీరోయిన్ హెబ్బా పటేల్ స్పెషల్ పాటలో మెరిసారు.
హీరో రామ్, హీరోయిన్ హెబ్బా పటేల్‌పై చిత్రీకరించిన 'ఏయ్ డించక్ డించక్ డింక .. ఆడ ఈడ దూక కే జింక ...డించ క్ డించ క్ డింక .. మా బీచ్ కి రావే ఇంక' పాటను ప్రేక్షకులను, సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకొంటున్నది. ఈ పాటను కాసర్ల శ్యామ్ రాయగా, సాకేత్, కీర్తనా శర్మ ఆలపించగా జానీ మాస్టర్ నృత్య దర్శకత్వం చేశారు. ఈ పాట ప్రస్తుతం యూట్యూబ్‌లో 100K వ్యూస్ అందుకొన్నది. రామ్ కెరీర్‌లో ఇదో మైలురాయిగా చిత్ర యూనిట్ పేర్కొంటున్నది.

డించిక్ పాట గురించి నృత్య దర్శకుడు జానీ మాస్టర్ మాట్లాడుతూ "మార్చి నెలలో లాక్ డౌన్ కు ముందు చేసిన పాట ఇది. చాలా ఎనర్జిటిక్ సాంగ్ ఇది. ఈ పాట విషయంలో హీరో రామ్ కి స్పెషల్ థాంక్స్ చెప్పుకోవాలి. ఈ పాట బాగా రావడానికి ఆయన ఇచ్చిన ఇన్ పుట్స్ బాగా ఉపకరించాయి. పాట ఎక్స్ట్రాఆర్డినరీ గా వచ్చింది. రామ్ తన స్టెప్స్ తో ఇరగ దీసేశారు. హెబ్బా పటేల్ కి ఇదే ఫస్ట్ టైమ్ స్పెషల్ సాంగ్ చేయడం. తను కూడా చాలా బాగా చేసింది. ఈ పాట బాగా రావడానికి బడ్జెట్ పరంగా రవి కిషోర్ గారు ఫుల్ ఫ్రీడం ఇచ్చారు. మణి శర్మ ఎనర్జిటిక్ మ్యూజిక్ ఇచ్చారు. ముఖ్యంగా బీజియమ్స్ అదిరిపోయాయి. థియేటర్ లలో ఈ పాట ప్రేక్షకుల్ని ఉర్రూతలూగిస్తుంది." అని చెప్పారు.
నటీనటులు:
రామ్, నివేదా పేతురాజ్, మాళవికా శర్మ, అమృతా అయ్యర్, హెబ్బా పటేల్, నాజర్ తదితరులు
సాంకేతిక నిపుణులు:
సంస్థ: శ‌్రీ స్రవంతి మూవీస్, సంగీతం: మణిశర్మ, ఛాయాగ్రహణం: సమీర్ రెడ్డి, ఆర్ట్: ఎ.ఎస్.ప్రకాష్, ఫైట్స్: పీటర్ హెయిన్స్, ఎడిటింగ్: జునైద్, సమర్పణ: కృష్ణ పోతినేని, నిర్మాత: 'స్రవంతి' రవికిశోర్, దర్శకత్వం: కిశోర్ తిరుమల.


Click it and Unblock the Notifications











