‘హే ఇది నేనేనా’ అంటోన్న యువత.. అదరగొట్టిన తమన్

సంగీత దర్శకుడు తమన్ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడమే కాదు.. అంతకు మించి అనే స్టైల్లో సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇప్పటికే తమన్ సోలో బ్రతుకే సో బెటర్ చిత్రానికి ఓ రేంజ్ హైప్‌ను తీసుకొచ్చాడు. నో పెళ్లి అంటూ అందర్నీ ఓ ఊపు ఊపేశాడు. ఇక రెండో పాటను తాజాగా విడుదల చేశారు. ఈ మేరకు నిన్న సాయంత్రం తమన్ కాస్త ఎమోషనల్ అయ్యాడు. ఈ పాటను ప్రాణం పెట్టి కొట్టాను.. మీ అందరికీ నచ్చుతుందని చెప్పాడు.

సాయి ధరమ్ తేజ్ పట్ల నాకున్న ప్రేమ, నమ్మకానికి ప్రతిబింబంలా ఈ పాట ఉంటుందని, హే ఇది నేనేనా అనే పాట మీ అందరికీ పిచ్చెక్కిస్తుందని చెప్పుకొచ్చాడు. ఇక అలాగే చెప్పిన సమయానికి నేటి ఉదయం పది గంటలుకు పాటను విడుదల చేశారు. ఇక ఈ పాటను విన్న శ్రోతలంతా ఫిదా అవుతున్నారు. మళ్లీ మళ్లీ వినాలనేట్టుగా అందులో ఎంతో ఫీల్‌ ఉందని కితాబిస్తున్నారు.

Hey Idi Nenena From Solo Brathuke So Better Goes Viral

హే ఇది నేనేనా అనే పాటను రిలీజ్ చేస్తూ.. సంగీత కళాకారులకు, నా సింగర్స్‌కు , నా బృందానికి థ్యాంక్స్.. ఇలాంటి క్లిష్ట పరిస్థితిలోనూ ఎంతో శ్రమించారు. ఎప్పటికీ రుణ పడే ఉంటాను.. ప్రేమలో పడేందుకు మళ్లీ సమయం వచ్చింది. అంటూ ట్వీట్ చేశాడు. ఇక నిజంగానే ఈ పాటను విన్న ప్రతీ ఒక్కరూ ప్రేమలో పడాల్సిందే. ఈ పాట అంతా ఒకెత్తు అయితే వైజాగ్ లొకేషన్స్, బీచ్ అందాలు మరో ఎత్తు. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X