ఆ మాటంటేనే చిరాకు అంటూనే.. ఇంగ్లీష్ పాపతో నాగార్జున సరసాలు

టాలీవుడ్ మన్మథుడు టాలెంటే వేరులే. హీరోయిన్లతో రొమాన్స్ చేసి కిక్కివ్వడంతో ఆయనను మించిన తెలుగు హీరో లేరనే చెప్పుకోవచ్చు. ఆరు పదుల వయసుకు చేరువలో ఉన్నా రొమాంటిక్ సన్నివేశాల్లో తన స్టయిలే వేరని మన్మథుడు 2 ప్రమోషన్స్ ద్వారానే మరోసారి నిరూపిస్తున్నాడు నాగార్జున. ఇప్పటికే విడుదలైన టీజర్స్ మన్మథుడు 2 డోస్ ఎలా ఉంటుందనేది తెలపగా తాజాగా విడుదలైన 'హే మేనియా' సాంగ్ నాగార్జున లోని రొమాంటిక్‌నెస్ పూర్తిగా బటయపెట్టింది. చిత్రంలో నాగ్‌తో రొమాన్స్ చేసేది ఒక్క రకులే కాదు ఇంకా చాలామంది బ్యూటీలు ఉన్నారని ఈ సాంగ్ ద్వారా అర్థమవుతోంది.

'హేయ్ మెనీనా..' అంటూ హాయిగా సాగిపోతున్న ఈ లిరికల్ వీడియోలో ఇంగ్లీష్ పాపలతో నాగార్జున చేసిన సరసాలు హైలైట్ అయ్యాయి. ఓ రకంగా చెప్పాలంటే నాగ్ రొమాన్స్ పీక్స్‌లో ఉందని అనొచ్చు. మన్మథుడు అనే టైటిల్‌కి తగ్గట్టే ఫారిన్ లొకేషన్లలో నాగార్జున రొమాంటిక్ సీన్స్ యూత్ ఆడియన్స్‌ని ఆకట్టుకున్నాయి. నేను లవ్ చేయను.. ఓన్లీ లవ్ మేక్ చేస్తా! అంటూ నాగార్జున చెప్పిన డైలాగ్ ఈ సినిమాలో నాగ్ క్యారెక్టర్ ఎలా ఉంటుందనేది చెప్పింది. ఇక చైతన్ భరద్వాజ్ సంగీతం, శుభం విశ్వనాథ్ లిరిక్స్ ఈ సాంగ్‌ని ఓ రేంజ్‌కి తీసుకెళ్లాయి. సాంగ్ లో భాగంగానే వెన్నెల కిషోర్ తో 'అమ్మాయిల్ని పడేయటమంటేనే నాకు చిరాకు' అని నాగార్జున ఇచ్చిన కలరింగ్ సూపర్ అనే చెప్పాలి.

 Hey Menina Lyrical song From Manmadhudu 2

'మన్మథుడు 2' మూవీ రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. గతంలో నాగార్జున కెరీర్ లో సూపర్ డూపర్ హిట్‌గా నిలిచిన మన్మథడు చిత్రానికి కొనసాగింపుగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో నాగార్జున సరసన యంగ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఆడిపాడింది. సమంత, కీర్తి సురేష్, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆగస్ట్ 9 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X