వార్ సాంగ్ రిలీజ్: డ్యాన్స్ ఇరగదీసిన హృతిక్.. వీడియో వైరల్

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ - యంగ్ హీరో టైగర్ ష్రాఫ్‌తో కలిసి నటించిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'వార్'. పూర్తి యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమాను సిద్దార్ద్ ఆనంద్ డైరెక్ట్ చేశారు. యస్ రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న ఈ సినిమాలో వాణీ కపూర్ నటిస్తోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను గాంధీ జయంతి కానుకగా అక్టోబర్ 2న విడుదల చేయడానికి నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా హిందీ, తెలుగుతో పాటు మరికొన్ని చిత్రాల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

నాలుగు రోజుల క్రితం ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను చిత్ర బృందం విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందులో హృతిక్, టైగర్ మధ్య వచ్చే యాక్షన్ సీక్వెన్స్‌ను చూపించారు. వీరిద్దరూ నువ్వా నేనా అన్నట్లు పోటీ పడి మరీ నటించారని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఈ ఇద్దరు హీరోల మధ్య వచ్చే కార్‌ ఛేజింగులు, భారీ యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను కొత్త అనుభూతిని ఇవ్వనున్నాయని తెలుస్తోంది. అలాగే హీరోయిన్ గ్లామర్ కూడా ఆకట్టుకుంటుందన్న టాక్ వినిపిస్తోంది.

Saaho set nation on fire: Prabhas open about his affair with Anushka Shetty

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ 'గుంగరో' అంటూ సాగే వీడియో సాంగ్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇందులో హృతిక్ రోషన్ డ్యాన్స్ హైలైట్ అని చెప్పాలి. సునాయాసంగా ఆయన వేసిన స్టెప్పులు ఆకట్టుకుంటున్నాయి. వయసు పెరుగుతున్న ఆయనలో గ్రేస్ ఏమాత్రం తగ్గలేదని ఈ పాటలో డ్యాన్స్ చూస్తే అర్థం అవుతోంది. హృతిక్ డ్యాన్స్‌కు తోడు వాణీ కపూర్ గ్లామర్ దీనికి స్పెషల్ అట్రాక్షన్ అవుతోంది. ముఖ్యంగా ఆమె బికినీ ట్రీట్ యువతను మెప్పిస్తుందని చెప్పవచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X