హుషారు ఆడియోకు 5 మిలియన్ల వ్యూస్.. ట్రెండింగ్‌గా ఉండిపోరాదే..
లక్కీ మీడియా బ్యానర్లో తొమ్మిదో చిత్రంగా వస్తున్న 'హుషారు' పాటలు యూట్యూబ్, సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా నిలుస్తున్నాయి. అర్జున్ రెడ్డి మ్యూజిక్ డైరెక్టర్ రధాన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ చిత్రంలోని పాటలు, మాస్, మెలోడీతో కలిసి ఉన్నాయి. ప్రధానంగా గీత గోవిందం 'ఇంకా ఇంకా' ఫేం.. సిద్ శ్రీరామ్ పాడిన 'ఉండిపోరాదే' పాట ఇప్పటికే బ్రహ్మాండమైన రెస్పాన్స్‌ను కూడగట్టుకొన్నది.
ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలైన ఉండిపోరాదే పాట 2 మిలియన్లకుపైగా వ్యూస్ సాధించింది. ట్విట్టర్, ఫేస్‌బుక్, టిక్ టాక్, ఇన్‌స్టాగ్రామ్ మొత్తం సోషల్ మీడియా లో 5 మిలియన్ల వ్యూస్ సాధించింది. ఇటీవల విజయ్ దేవరకొండ రిలీజ్ చేసిన పాటకు మంచి రెస్సాన్స్ లభించింది. దాంతో సంగీత ప్రధానమైన చిత్రంగా హుషారు సినిమా రేంజ్ అమాంతంగా పెంచింది. పూర్తి యూత్‌ఫుల్, రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిన హుషారు సినిమా డిసెంబర్ 7న విడుదల సిద్ధమవుతున్నది.

హుషారు ప్రమోషన్‌లో భాగంగా ఈ చిత్ర యూనిట్ ఇప్పటికే గుంటూరు, విజయవాడ, ఖమ్మం, వరంగల్, నెల్లూరు నగరాల్లోని ప్రధాన కళాశాలల్లో సందడి చేస్తున్నది.
తేజస్ కంచెర్ల, తేజ్ కూరపాటి, దినేష్ తేజ్, అభినవ్ మేడిశెట్టి, దక్ష నగరకర్, ప్రియా వడ్లమాని, హేమల్ హీరోయిన్లు గా నటించారు. రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రలో కనిపిస్తారు. శ్రీహర్ష కొనుగంటి దర్శకుడిగా వ్యవహరించారు. బెక్కెం వేణుగోపాల్, రియాజ్ సంయుక్తంగా హుషారును రూపొందించారు.


Click it and Unblock the Notifications











