Don't Miss!
- News
ఉస్మానియా యూనివర్సిటీలో పాముల బెడద .. పాముకాటుకు మహిళా ఉద్యోగిని మృతి; ఆందోళన!!
- Technology
Samsung Galaxy Z Fold 4 V/S Galaxy Z Fold 3 ఫోన్ల మధ్య తేడాలు? కొత్త ఫీచర్లు ఏంటో చూడండి.
- Automobiles
భారత్‌లో హార్లే డేవిడ్సన్ నైట్‌స్టర్ Harley Davidson Nightster మోటార్‌సైకిల్ విడుదల.. ధర, ఫీచర్లు
- Lifestyle
దశ మూలాలు కలిగిన ఈ ఆయుర్వేద ఔషధం మీ శరీరానికి ఎలాంటి అద్భుతాలు చేస్తుందో తెలుసా?
- Finance
Railway News: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రిజర్వేషన్ ప్రక్రియలో భారీ మార్పులు.. మీరూ తెలుసుకోండి..
- Sports
T20 World Cup 2022: అందుకే వాషింగ్టన్ సుందర్‌ను కాదని అశ్విన్‌ను ఎంపిక చేశారు!
- Travel
అంతరిక్ష కేంద్రంలో ఒక్క రోజు విహరిద్దామా..!
Ilaiyaraaja నుంచి మరో అణిముత్యం.. ట్రెండింగ్‌గా ఏదో ఏదో వెతికే సాంగ్
బాహుబలి చిత్రంలో కట్టప్ప పాత్రతో దేశవ్యాప్తంగా ప్రేక్షకాదరణను సొంతం చేసుకొన్న సత్యరాజ్ కుమారుడు సిబిరాజ్ హీరోగా యువ దర్శకుడు కిషోర్ దర్శకత్వంలో రూపొందిన ప్రతిష్ఠాత్మక చిత్రం మయోన్ ఈ చిత్ర హక్కులను మూవీమ్యాక్స్ అధినేత ప్రముఖ నిర్మాత మామిడాల శ్రీనివాస్ సొంతం చేసుకున్నారు. మాయోన్ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాలలో జూలై 7న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలోని ఎదో ఎదో ఏదో వెతికే నయనం చేతికి అందేదాకా ఆగదు పయనం అనే పాటను ఇటీవల విడుదల చేయగా, మంచి స్పందన సొంతం చేసుకొన్నది.

చిత్ర నిర్మాత మామిడాల శ్రీనివాస్ మాట్లాడుతూ..నాకు మాస్ట్రో ఇళయరాజా పాటలు అంటే చాలా ఇష్టం. ఇప్పటికే ఇసైజ్ఞాని ఇళయరాజా స్వరపరిచిన పాటలకు సంగీత ప్రియుల నుండి మంచి స్పందన లభించింది.ఈ చిత్రం ద్వారా ఆయనను కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అయన అభిమానినైన నేను అయన సంగీతం సారద్యంలో సత్య ప్రకాష్ ధర్మార్, శ్రీనిషా జయశీలన్ పాడిన "ఎదో ఎదో ఏదో వెతికే నయనం చేతికి అందేదాకా ఆగదు పయనం" పాటకు విడుదల చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమా పురాతన దేవాలయానికి సంబంధించిన ఒక రహస్య పరిశోధన నేపథ్యంలో హై టెక్నికల్ వాల్యూస్ తో రూపొందిన మిస్టరీ థ్రిల్లర్ మాయోన్ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నందు కు చాలా సంతోషంగా ఉంది.
God Versus Science మెయిన్ థీమ్‌గా మిస్టరీ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రాన్ని నిర్మాత అరుణ్ మోజి మాణికం భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఆయనే ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే రాయడం విశేషం. కిషోర్ ఎన్ దర్శకత్వం వహించిన ఈ మిస్టరీ థ్రిల్లర్‌కు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) 'U' సర్టిఫికేట్ మంజూరు చేసింది . ఈ సర్టిఫికేట్ మంజూరు చేసేటప్పుడు CBFC చిత్రానికి ఎలాంటి కట్‌లను సూచించ లేదు. హై టెక్నికల్ వాల్యూస్ తో రూపొందిన ఈ చిత్రానికి ఫోటోగ్రాఫీ స్పెష్ ఎస్సెట్ గా నిలుస్తుంది.ప్రముఖ కెమెరామ్యాన్ రాంప్రసాద్ మాయోన్చిత్రాన్ని సెల్యూలాయిడ్ వండర్‌గా మలిచారు.ఈ చిత్రంలో హీరో సిబిరాజ్ 'అర్జున్' అనే ఆర్కియాలజిస్ట్ గా నటిస్తుండగా, తాన్యా రవిచంద్రన్ ఎపిగ్రాఫిస్ట్ పాత్రలో కనువిందు చేయనుంది. ఇందులో నటించిన సత్యరాజ్ కుమారుడు సిబిరాజ్ కు మంచి భవిష్యత్త్ ఉంటుంది. మాయోన్ చిత్రాన్ని జూలై 7 న తెలుగు రాష్ట్రాలలో ధియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ చేస్తామని అన్నారు.
నటీనటులు:
సిబిరాజ్,
తాన్యా
రవిచంద్రన్,
రాధా
రవి,
కేఎస్
రవికుమార్,
ఎస్ఏ
చంద్రశేఖర్,
భగవతి
పెరుమాళ్
(బక్స్),
హరీష్
పెరడి,
అరాష్
షా
తదితరులు
దర్శకత్వం:
కిషోర్
ఎన్
నిర్మాత:
మామిడాల
శ్రీనివాస్,అరుణ్
మోజి
మాణికం
పీఆర్వో:
మధు
వీఆర్