యువ గాయని ఆరోగ్యం విషమం.. ప్రియుడి సూసైడ్‌ను జీర్ణించుకోలేక..

ఇండియన్ ఐడల్ 10 కంటెస్టెంట్, టాలెంట్ సింగర్ రేణు నగర్ ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. ప్రస్తుతం చావు బతుకులతో ఈ యువ గాయని పోరాటం సాగిస్తున్నది. ప్రేమించిన వ్యక్తి దూరం కావడమే ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడానికి కారణమని తెలుస్తున్నది. ఆమె కోలుకోవాలని అభిమానులు, కుటుంబ సభ్యులు ప్రార్థిస్తున్నారు. గాయని రేణు విషాద పరిస్థితుల గురించి.. ఇండియన్ ఐడల్ కార్యక్రమంతో ప్రేక్షకాదరణ పొందిన రేణు నగర్ కొద్దిరోజులుగా రవి శంకర్ అనే యువకుడితో ప్రేమలో పడింది. వారిద్దరు ఇంటి నుంచి పారిపోయి పెళ్లి చేసుకొనేందుకు ప్రయత్నించారు. ఇండియన్ ఐడల్ 10 కంటెస్టెంట్, టాలెంట్ సింగర్ రేణు నగర్ ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. ప్రస్తుతం చావు బతుకులతో ఈ యువ గాయని పోరాటం సాగిస్తున్నది. ప్రేమించిన వ్యక్తి దూరం కావడమే ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడానికి కారణమని తెలుస్తున్నది. ఆమె కోలుకోవాలని అభిమానులు, కుటుంబ సభ్యులు ప్రార్థిస్తున్నారు. గాయని రేణు విషాద పరిస్థితుల గురించి..

ఇండియన్ ఐడల్ కార్యక్రమంతో

ఇండియన్ ఐడల్ కార్యక్రమంతో

ఇండియన్ ఐడల్ కార్యక్రమంతో ప్రేక్షకాదరణ పొందిన రేణు నగర్ కొద్దిరోజులుగా రవి శంకర్ అనే యువకుడితో ప్రేమలో పడింది. వారిద్దరు ఇంటి నుంచి పారిపోయి పెళ్లి చేసుకొనేందుకు ప్రయత్నించారు. దాంతో రేణు తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తన కూతురుకు మాయ మాటలు చెప్పి మోసం చేసి తీసుకెళ్లాడనే కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో రాజస్థాన్‌లోని అల్వార్ పోలీసులు కేసు నమోదు చేశారు.

రేణు బాయ్‌ఫ్రెండ్ మరణంతో

రేణు బాయ్‌ఫ్రెండ్ మరణంతో

రవిపై రేణు కుటుంబ సభ్యులు ఫిర్యాదు తర్వాత ఐదు రోజుల అనంతరం వారిద్దరూ తమ ఇంటికి తిరిగి వచ్చారు. అయితే కేసు నమోదు కావడంతో రవిని పిలిచి పోలీసులు విచారించారు. అనంతరం ఇంటికి వెళ్లిన రవి ఆ రాత్రి విషం తాగి ఆత్మహత్య చేసుకొన్నారు. ఆ వార్త విన్న తర్వాత రేణు షాక్‌తో స్పృహ కోల్పోయారు.

 ప్రియుడు ఇకలేడనే వార్తతో

ప్రియుడు ఇకలేడనే వార్తతో

తన ప్రియుడు రవి ఇకలేరనే వార్తను జీర్ణించుకోలేకోపోయిన రేణు నగర్ ఆరోగ్యం మరింత విషమించడంతో స్థానిక మిట్టల్ హాస్పిటల్‌లోని హాస్పిటల్‌కు తరలించారు. అయితే ఇప్పటికీ రేణు ఆరోగ్యం కుదుటపడలేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆమె ప్రాణాలు కాపాడటానికి వైద్య బృందం తీవ్రంగా ప్రయత్నిస్తున్నది.

Recommended Video

Nepotism పై Renu Desai హాట్ కామెంట్స్‌!
 రేణు, రవి ప్రేమ కథ ఆసక్తికరంగా

రేణు, రవి ప్రేమ కథ ఆసక్తికరంగా

అయితే రవి, గాయని రేణు ప్రేమ కథలో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రేణు ఇంటిలోనే రవి తబాలా నేర్చుకొనేందుకు వచ్చే వాడని స్థానికులు వెల్లడించారు. ఆ సమయంలోనే వారిద్దరి ప్రేమలో పడ్డారు. కానీ రవికి అప్పటికే వివాహం జరిగి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారనే విషయం ఇప్పుడు చర్చనీయాంశమైంది. వివాహితుడితో ప్రేమలో పడటంపై కుటుంబ సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలుపుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X