OG: పవన్ కల్యాణ్ మూవీలో పాట పడటం గొప్ప అదృష్టం.. ఇండియన్ ఐడల్ ఫైనలిస్ట్ ఉద్వేగం
ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న పాపులర్ షో ఇండియన్ ఐడల్ సీజన్ 3 ముగింపు దశకు చేరుకొన్నది. ఈ సీజన్‌లో నజీరుద్దీన్, శ్రీకీర్తి, కీర్తన, అనిరుధ్, స్కంధ ఫైనలిస్టుగా మారారు. గ్రాండ్ ఫినాలేకు ముందు టీమ్ సభ్యులు నజీరుద్దీన్ తెలుగు ఫిల్మీబీట్‌తో మాట్లాడుతూ..
ప్రస్తుత ఇండియన్ ఐడల్ సీజన్‌లో థమన్, గీతా మాధురీ, కార్తీక్ లాంటి జడ్జీలు నాకు మంచి సహకారం అందించారు. ఈ ముగ్గురు ఏదో విధంగా నాకు సపోర్ట్ చేశారు. ఎలాంటి కష్టాలను అధిగమించి ఈ దశకు చేరుకొన్నారో చెప్పినప్పుడు స్పూర్తిని ఇస్తుంది. వారిని చూసి మేము కూడా ఆస్థాయికి చేరాలనే కోరిక కలిగింది అని నజీరుద్దీన్ తెలిపాడు.

ఇండియన్ ఐడల్‌లో ఉండగానే థమన్ సార్.. నాతో OG సినిమాలో ఓ పాట పాడించారు. నా జీవితానికి అది పెద్ద అఫర్. అలాంటి ఆఫర్ ఊహించలేదు. పాన్ ఇండియా సినిమాలో పాడే అవకాశం కల్పించడం హ్యాపీగా ఉంది అని అన్నారు.
గీతా మాధురి అక్కతో మేము ఖతార్‌కు వెళ్తున్నాం. అలాంటి సపోర్ట్ గీతక్క ఇచ్చింది. కార్తీక్.. నా వాయిస్‌ను చాలా మెచ్చుకొన్నారు. నీ వాయిసే నిన్ను ఎంతో ఎత్తుకు చేర్చేలా చేస్తుందన్నారు. తెలుగు టెలివిజన్‌లో ఆహాలో ఇండియన్ ఐడల్ షో చాలా పెద్దది. మీలో టాలెంట్ ఉందని గ్రహిస్తే కార్తీక్, థమన్, గీతా మాధురి వారితో ఎక్కడికైనా తీసుకెళ్తారు. అలాంటి షోలో ప్రతిభను నిరూపించుకొనే అవకాశం రావడంతో హెల్తీ కాంపిటీషన్‌తో పోటీపడ్డా అని అన్నారు.
నాకు బాలసుబ్రమణ్యం అంటే చాలా ఇష్టం. అలాగే ఏఆర్ రెహ్మాన్ పాట పాడాలని అనుకొన్నాం. వారిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన పాటను నా చెలి రోజావే పాటను పాడాలి అని అనుకొన్నాను. చిన్నప్పుడే నేను బాలసుబ్రమణ్యం ముందు పాడాను. అప్పుడు నేను ఆయన గొప్పతనం తెలియదు. ఇప్పుడు ఇప్పుడు ఆయన ఖ్యాతి తెలిసినప్పుడు థ్రిల్ అవుతుంది. పాట పాటకు ఎలా మెలోడీ పండించాలో ఆయన వద్ద చేసుకొన్నాను అని నజీరుద్దీన్ నజీరుద్దీన్


Click it and Unblock the Notifications











