65th Annual Grammy Awards: మరో భారతీయుడి సంచలనం.. మూడవసారి కూడా ఆ అవార్డుతో రికార్డ్!
మ్యూజిక్ అవార్డ్స్ కు ప్రత్యేకంగా పేరు గాంచిన గ్రామీ అవార్డుల కోసం ప్రపంచ వ్యాప్తంగా ప్రతీ సారి తీవ్రమైన. పోటీ కనిపిస్తోంది. ఇక ఈసారి 65వ వార్షిక గ్రామీ అవార్డుల వేడుక ఫిబ్రవరి 5న లాస్ ఏంజిల్స్‌లో అరేనాలో మొదలైంది. ఇక ఈ వేడుకకు ప్రపంచ నలుమూలల నుంచి ప్రముఖ సంగీత కళాకారులు పాల్గొన్నారు. ఇక ఈ వేడుకలో భారతదేశానికి చెందిన రికీ కేజ్ తన ఆల్బమ్ డివైన్ టైడ్స్ కు గాను ఈ సంవత్సరం గ్రామీ పురస్కారం గెలుచుకున్నాడు. అతని ఆల్బమ్ ఉత్తమ ఆడియో ఆల్బమ్ విభాగంలో నామినేట్ అయ్యింది.
ప్రతీ ఏడాది కూడా ఎన్నో ప్రయివేట్ ఆల్బమ్స్ ఈ సంగీత మహోత్సవ వేడుకలో హైలెట్ అవుతున్నాయి. ఇక మన ఇండియా నుంచి కూడా గత పదేళ్ల కాలంలో కొన్ని ఆల్బమ్స్ పోటీలో నిలుస్తూ ఉండడం విశేషం. ఇక ఇప్పుడు రికీ కేజ్ మరోసారి నామినేషన్ లో ఉండడమే కాకుండా గ్రామీ అవార్డును సొంతం చేసుకోవడం విశేషం. బ్రిటీష్ రాక్ బ్యాండ్ ది పోలీస్ డ్రమ్మర్ గా క్రేజ్ అందుకున్న రికీ కేజ్ స్టీవర్ట్ కోప్‌ల్యాండ్ తో కలిసి అవార్డును అందుకున్నాడు.

ఇదివరకే రికీ కేజ్ రెండుసార్లు ఈ గ్రామీ అవార్డులను దక్కించుకున్నాడు. ఇక ఇప్పుడు మరోసారి మరో అవార్డుని సొంతం చేసుకొని హాలీవుడ్ మీడియా దృష్టిని ఆకర్షించాడు. ఈ ఫీట్‌తో మూడు గ్రామీ అవార్డులు అందుకున్న ఏకైక భారతీయుడిగా కేజ్ నిలిచి మరో రికార్డును అందుకున్నాడు. ఇక ఆ కేటగిరీలోని ఇతర నామినీలు: క్రిస్టినా అగ్యిలేరా (అగ్యిలేరా), ది చైన్స్‌మోకర్స్ (మెమోరీస్ డోంట్ ఓపెన్), జేన్ ఇరాబ్లూమ్ (పిక్చరింగ్ ది ఇన్విజిబుల్- ఫోకస్ 1), అలాగే నిడరోస్డోమెన్స్ జెంటెకోర్ & ట్రోండెహీమ్‌సోలిస్టేన్ (తువాహ్యున్ - బీఎడిట్యుడ్స్ ఫర్ ఎ డబ్ల్యు) అల్బమ్స్ కూడా ఉన్నాయి.
రికీ కేజ్ ఆల్బమ్ బెస్ట్ గా నిలవడంతో 2023 గ్రామీ అవార్డును అతను సొంతం చేసుకున్నాడు. ఇక గెలిచిన అనంతరం రికీ కేజ్ అవార్డుతో దిగిన ఫొటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. ఇక 64వ గ్రామీ అవార్డ్స్ లో రికీ కేజ్ బెస్ట్ న్యూ ఏజ్ ఆల్బమ్ విభాగంలో తన రెండవ గ్రామీని గెలుచుకున్నాడు. అంతకుముందు 2015లో రికీ కేజ్ విండ్స్ ఆఫ్ మ్యూజిక్ ఆల్బమ్ కు తన మొదటి గ్రామీ పురస్కారం గెలుచుకున్నాడు.


Click it and Unblock the Notifications











