ఎయిర్‌పోర్ట్‌లో బుట్టబొమ్మల గుంపు.. వీడియో వైరల్
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ అల వైకుంఠపురములో చిత్రం తెలుగు సినీ చరిత్రలో ఓ చెరిగిపోని అధ్యాయాన్ని లిఖించింది. సోషల్ మీడియోలో మునుపెన్నడూ, భవిష్యత్తులో చూడబోని రికార్డులను నెలకొల్పాడు. అల్లు అర్జున్ స్టైలీష్ స్టెప్పులు, తమన్ మ్యూజిక్ ఇలా ప్రతీ ఒక్కటి కలిసి అల వైకుంఠపురములో ఆల్బమ్‌ను ప్రపంచ వ్యాప్తంగా వైరల్ చేశాయి. అందులో మరీ ముఖ్యంగా బొట్టబొమ్మ ఖండాంతరాలకు చేరింది.
బుట్టబొమ్మకు సోషల్ మీడియాలో కొన్ని కోట్ల మంది అభిమానులున్నారు. పెద్ద పెద్ద సెలెబ్రిటీలు సైతం బుట్టబొమ్మ స్టెప్పులకు ఫిదా అయ్యారు. టిక్ టాక్ యాప్‌లో అయితే బుట్టబొమ్మ పాటకు కాలు కదపని వారెవ్వరూ ఉండరు. ఆస్ట్రేలియన్ క్రికెట్ డేవిడ్ వార్నర్ సైతం బుట్టబొమ్మకు భార్యతో కలిసి స్టెప్పులు వేశాడు. బాలీవుడ్ బ్యూటీ శిల్పా శెట్టి, కేరళ బ్యూటీ మంజూ వారియర్ ఇలా ప్రతీ ఒక్కరూ బుట్టబొమ్మ మాయలో పడిపోయారు.

తాజాగా ఇండిగో ఎయిర్ లైన్స్ సంస్థ వైజాగ్ ఎయిర్‌పోర్ట్‌లో సామూహికంగా తమ సిబ్బందితో బుట్టబొమ్మకు స్టెప్పులు వేయించింది. ఇక అందరూ ఒకే టైమింగ్ ఒకే గ్రేస్ బుట్టబొమ్మ స్టెప్పులు వేయడంతో ఏకంగా అల్లు అర్జునే కదిలిసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. అల వైకుంఠపురములో పాటలు యూ ట్యూబ్‌లో ఇప్పటికే కొత్త కొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. ఇలా ఏదో ఒక విషయంలో అల వైకుంఠపురములో వార్తల్లో నిలుస్తూనే ఉంటోంది.


Click it and Unblock the Notifications











