HBD Priyadarshi సారంగపాణి జాతకంతో ప్రియదర్శి.. ఇంద్రగంటి, శివలెంక కాంబోకు హ్యాట్రిక్ ఖాయమా?
తెలుగు సినిమా పరిశ్రమలో శ్రీదేవీ మూవీస్‌కు అత్యంత ప్రతిష్టాత్మకమైన సినీ నిర్మాణ సంస్థగా పేరున్నది. ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మాతగా ఆదిత్య 369 లాంటి గొప్ప చిత్రాలను అందించిన హిస్టరీ ఆ సంస్థకు ఉంది. ఉత్తమ కథ, కథనాలే..ప్రేక్షకుల అనుభూతే లక్ష్యంగా సినిమాలను రూపొందించే ఈ ప్రొడక్షన్ హౌస్ తాజాగా సారంగపాణి జాతకం అనే సినిమాతో ఆడియెన్స్ ముందుకు వస్తున్నది. ఈ సినిమా టైటిల్ అనౌన్స్‌మెంట్‌తోనే ప్రేక్షకులను ఆకట్టుకొనేలా చేసింది. ఈ వివరాల్లోకి వెళితే..
శ్రీదేవీ మూవీస్ బ్యానర్‌తో సృజనాత్మక దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటికి ప్రత్యేకమైన అనుబంధం ఉంది. గతంలో నానితో జంటిల్మెన్, హీరో సుధీర్ బాబుతో సమ్మోహనం సినిమాలతో హిట్స్ సాధించారు. ఇక హ్యాట్రిక్ చిత్రం కోసం సారంగపాణి జాతకం అనే సినిమాతో సిద్దమయ్యారు.

ఇక ఈ సినిమా టైటిల్‌ను నటుడు, కమెడియన్ ప్రియదర్శి జన్మదినం పురస్కరించుకొని ఆవిష్కరించారు. ఈ సినిమా టైటిల్ వినగానే ఫీల్ గుడ్ సినిమా రాబోతుందనే విషయం స్పస్టమైంది. కథ, కథనాలకు తగినట్టే బడ్జెట్ విషయంలో రాజీ పడకుండా ఈ సినిమాను నిర్మించినట్టు చిత్ర యూనిట్ స్పష్టం చేసింది.
శ్రీదేవీ మూవీస్ బ్యానర్‌తోపాటు నాకు ఇంద్రగంటి మోహన కృష్ణకు ప్రత్యేక అనుబంధం ఉంది. మా కాంబినేషన్‌లో రెండు హిట్ సినిమాలు వచ్చాయి. ఇటీవల ఇంద్రగంటి చెప్పిన కథ బాగా నచ్చడంతో ఈ సినిమా చేయాలని నిర్ణయించుకొన్నాం. కథ డిమాండ్ చేసిన మేరకు మేము బడ్జెట్ విషయంలో రాజీ పడలేదు. సినిమా అవుట్ పుట్ బ్రహ్మండంగా వచ్చింది. మా కాంబినేషన్‌లో హ్యాట్రిక్ ఖాయం. మా హీరో ప్రియదర్శి బర్త్ డే సందర్భంగా ఈ మూవీ టైటిల్‌ను అనౌన్స్ చేశాం. ఈ సినిమా టైటిల్‌కు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ రావడం చాలా హ్యాపీగా ఉంది అని నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ అన్నారు.
ఇక ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం, పీజీ విందా సినిమాటోగ్రఫి, మార్తాండ్ వెంకటేష్ ఎడిటింగ్, రామజోగయ్య శాస్త్రీ సాహిత్యం అందిస్తున్నారు. ఈ చిత్రానికి విద్య శివలెంక నిర్మాణ బాధ్యతల్ని పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం డబ్బింగ్, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకొంటున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నది.


Click it and Unblock the Notifications











