లోకేష్ కనకరాజ్‌తో శృతిహాసన్ రొమాన్స్.. ఓ రేంజ్‌లో మతిపోయేలా శృంగారం!

ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై లెజెండరీ యాక్టర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ కమల్ హాసన్, ఆర్ మహేంద్రన్ సంయుక్తంగా నిర్మించిన మ్యూజికల్ ఆల్బమ్ ఇనిమెల్ (Inimel). ఈ మ్యూజిక్ ఆల్బమ్‌లో స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్, శృతిహసన్ జంటగా నటించారు. హోళీ పండుగను పురస్కరించుకొని వీడియో సాంగ్‌ను యూట్యూబ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ మ్యూజిక్ ఆల్బమ్ వివరాల్లోకి వెళితే..

నేటితరం లివింగ్ రిలేషన్‌షిప్
ఇనిమెల్ (Inimel) అంటే ఇప్పటి నుంచి అని అర్ధం. ఓ యువతి, యువకుడి మధ్య ప్రేమ చిగురించి.. లివింగ్ రిలేషన్‌షిప్‌లో శృంగార జీవితాన్ని అనుభవించి.. ఎంగేజ్‌మెంట్ చేసుకోవడం వరకు సాగుతుంది. ఆ లివింగ్ షిప్‌లో అమ్మాయి ప్రెగ్నెంట్ కావడం.. వారి మధ్య కలహాలు చోటు చేసుకోవడం.. బ్రేకప్‌కు దారి తీస్తున్న సమయంలో వారి రిలేషన్స్ సరిద్దిద్దుకొని ఇప్పటి నుంచి కొత్త జీవితాన్ని ఆస్వాదిస్తామనేది కాన్సెప్ట్. ఈ మ్యూజిక్ ఆల్బమ్‌లో యువతిగా శృతి హాసన్, యువకుడిగా లోకేష్ కనకరాజ్ నటించారు.

Inimel Music Album Review Shruti Haasan Romantic and lovely Chemistry with Lokesh Kangaraj breaks your Heart

శృతిహాసన్ అన్నీ తానై..
ఇనిమెల్ (Inimel) మ్యూజిక్ ఆల్బమ్‌కు శృతి హాసన్ స్వయంగా కాన్సెప్ట్ డిజైన్.. మ్యూజిక్ కంపోజ్ చేయడం విశేషంగా మారింది. ఈ వీడియో సాంగ్‌కు కమల్ హాసన్ సాహిత్యం రాయడం మరో విశేషంగా మారింది. దీనికి ద్వారకేష్ ప్రభాకర్ దర్శకత్వం వహించారు. భువన్ గౌడ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. ఎడిటర్‌గా ఫిలోమిన్ రాజ్ వ్యవహరించారు.

Inimel Music Album Review Shruti Haasan Romantic and lovely Chemistry with Lokesh Kangaraj breaks your Heart

లోకేష్, శృతిహాసన్ ఆన్ స్క్రీన్ రొమాన్స్
ఇప్పటి వరకు ఎన్నో సంచలన చిత్రాలను తన దర్శకత్వ ప్రతిభతో అందించిన లోకేష్ కనకరాజ్
తొలిసారి నటుడిగా అవతారం ఎత్తారు. రొమాంటిక్ మ్యూజిక్ ఆల్బమ్‌లో శృతిహాసన్‌తో కలిసి పండించిన కెమిస్ట్రీ యువతను గిలిగింతలు పెట్టేలా ఉంది. లోకేష్, శృతిహాసన్ ఇద్దరు కలిసి చూపించిన సున్నిత శృంగారం అందర్నీ ఆకట్టుకొన్నది.

నటుడిగా లోకేష్ కనకరాజ్ ఎలా చేశాడంటే?
ఇనిమెల్ (Inimel) మ్యూజిక్ ఆల్బమ్‌లో లోకేష్ కనకరాజ్ చూపించిన యాటిట్యూడ్, బాడీ లాంగ్వేజ్ స్టార్ హీరోలకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఉంది. ఇక శృతిహాసన్ ఎందరో హీరోలతో లవ్ అండ్ రొమాంటిక్ సీన్లు, సాంగ్స్‌లో నటించి మెప్పించింది. అయితే ఈ మ్యూజిక్ వీడియోలో చూపించిన హావభావాలు కొత్తగా ఉన్నాయి. మ్యూజిక్ పరంగా యూత్‌కు బాగా కనెక్ట్ చేసేలా ఉండటమే కాకుండా హంటింగ్‌గా కూడా ఉంది.

Inimel Music Album Review Shruti Haasan Romantic and lovely Chemistry with Lokesh Kangaraj breaks your Heart

తెర ముందు, తెర వెనుక
నటీనటులు: శృతిహాసన్, లోకేష్ కనకరాజ్
దర్శకత్వం: ద్వారకేష్ ప్రభాకర్
నిర్మాతలు: కమల్ హాసన్, ఆర్ మహేంద్రన్
లిరిక్స్: కమల్ హాసన్
మ్యూజిక్, కాన్సెప్ట్: శృతిహాసన్
సినిమాటోగ్రఫి: భువన్ గౌడ
ఎడిటర్: ఫిలోమిన్ రాజ్
ప్రొడక్షన్ డిజైనర్: శ్రీరామ్ అయ్యాంగర్
ఆర్ట్ డైరెక్టర్: సౌందర్ నల్లసామి
బ్యానర్: రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X