ఆమె చేతిలో చేయి వేసిన నాని.. ‘టక్ జగదీశ్’ ప్రమోషన్స్ షురూ
న్యాచురల్ స్టార్ నాని గురించి ప్రత్యకంగా చెప్పాల్సిన పనే లేదు. అతని నటన, అతని సినిమాలే నాని గురించి ఎంతో చెబుతుంటాయి. ప్రయోగాత్మక కథలను ఓకే చెప్పడంలో నాని ఎప్పుడూ ముందుంటాడు. అయితే ఆ మధ్య కమర్షియల్ చిత్రాలు, మాస్ ఇమేజ్ కోసం పరితపించి చేతులు కాల్చుకున్నాడు. కానీ మళ్లీ వెంటనే తన ట్రాక్‌లోకి ఎక్కాడు. కథ, నటనకు ప్రాధాన్యమున్న చిత్రాలనే ఎంచుకుంటున్నాడు.
ప్రస్తుతం నాని చేతిలో పలురకాల ప్రాజెక్ట్‌లున్నాయి. శ్యామ్ సింఘరాయ్, అంటే సుందరానికీ అంటూ రెండు ప్రాజెక్ట్‌లు సెట్స్ మీదున్నాయి. ఇక టక్ జగదీశ్ సినిమా విడుదలయ్యేందుకు కూడా రెడీ అవుతోంది. ఆ రెంటితో పోల్చితే టక్ జగదీశ్ ప్రేక్షకులను ముందుగా పలకరించబోతోంది. ఇప్పటికే వదలిన పోస్టర్లు బాగానే క్లిక్ అయ్యాయి. ఇక ఆ మధ్య సినిమా విడుదల తేదీ కూడా ప్రకటించేశారు. ఏప్రిల్ 16న ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు రాబోతోంది.

అయితే ఈ మూవీ నుంచి తాజాగా ఓ అప్డేట్ వచ్చింది. ఓ కూల్ అండ్ రొమాంటిక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో హీరోయిన్ రీతూ వర్మ చేతిని తన చేతుల్లోకి తీసుకున్న నాని ఏదో ముచ్చట్లు చెబుతున్నాడు. ఇంకోసారి ఇంకోసారి అనే ఫస్ట్ సింగిల్‌ను ఫిబ్రవరి 13న ఉదయం తొమ్మిది గంటలకు విడుదల చేస్తామని ప్రకటించారు. ఈ మూవీకి తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ కూల్ పోస్టర్ తెగ వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











