Leo అనిరుధ్‌పై కాపీ ఆరోపణలు.. లియో పాట వివాదంపై మ్యూజిక్ డైరెక్టర్ షాకింగ్ పోస్ట్!

ఇండియన్ మ్యూజిక్ ఇండస్ట్రీ, ఫిలిం ఇండస్ట్రీలో గొప్పగా వినిపిస్తున్న మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్. ఇటీవల కాలంలో జైలర్, లియో సినిమాలను తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో మరో రేంజ్‌కు తీసుకెళ్లారంటే ఏ మాత్రం అతిశయోక్తి కాదేమో అనిపిస్తుంది. అలాంటి మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ప్రస్తుతం కాపీ ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. తాజాగా ఆయన ఎదుర్కొంటున్న కాపీరైట్ ఉల్లంఘన వివాదంలోకి వెళితే..

విజయ్, సంజయ్ దత్, అర్జున్ సర్జా, గౌతమ్ వాసుదేవన్ మీనన్, త్రిష నటించిన లియో చిత్రం ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల దుమారం రేపుతున్నది. ఈ సినిమా ఇప్పటికే దేశంలోనే కాకుండా హాలీవుడ్‌లో కూడా రికార్డు వసూళ్లను సాధిస్తున్నది. ఈ సినిమా విజయానికి అనిరుధ్ మ్యూజిక్ ఓ కారణంగా మారింది. అయితే ఈ సినిమాలో ఓ పాటను కాపీ చేసినట్టు వార్తలు వచ్చాయి.

Is Anirudh Ravichander Copied Leos Ordinary Man an Song from Otnikas Where are you?

లియో చి్తరంలో ఆర్డినరీ మ్యాన్ అనే పాటకు మంచి సంగీత ప్రియుల నుంచి మంచి స్పందన వస్తున్నది. అయితే బెలారష్యన్ మ్యూజిక్ డైరెక్టర్ ఒట్నికా రూపొందించిన వేర్ ఆర్ యూ (Where are you) అనే పాట ట్యూన్ మాదిరిగా ఉందనే విషయం సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్నాయి. దాంతో అనిరుధ్ కాపీ కొట్టాడా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

అయితే మ్యూజిక్ డైరెక్టర్ ఒట్నికా దృష్టికి లియోలోని ఆర్డీనరీ మ్యాన్ పాట వెళ్లింది. అయితే ఆయన యూట్యూబ్, ఇన్స్‌టాగ్రామ్‌లో అభిమానులు వ్యక్తం చేసిన అనుమానాలపై ఆయన స్పందించాడు. ఆ పాట నా సాంగ్‌ను పోలీ ఉంది. అయితే ఎవరు కూడా నా నుంచి నా పాట కోసం అనుమతి తీసుకొలేదు అని ఆయన కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పారు.

Is Anirudh Ravichander Copied Leos Ordinary Man an Song from Otnikas Where are you?

లియో సినిమా కోసం తన పాటను అనిరుధ్ కాపీ చేశారనే వార్తల మధ్య ఒట్నికా ఇన్స్‌టాగ్రామ్‌లో ఓ పోస్టు పెట్టారు. లియో మూవీ గురించి నాకు మెసేజ్ చేసినందుకు థ్యాంక్స్. మీరు పెడుతున్న పోస్టులను చూస్తున్నాను. అయితే వ్యక్తిగతంగా నేను ప్రతీ ఒక్కరికి సమాధానం చెప్పలేను. నా మెయిల్ బాక్స్ మెసేజెస్‌తో ఓవర్‌ఫ్లో అవుతున్నది.వేర్ ఆర్ యూ వీడియో కింద వేల కామెంట్లు చేశాను అని తన పోస్టులో తెలిపారు.

అయితే లియో కాపీ విషయంపై పరిస్థితిపై నేను అంచనాకు రాలేకపోతున్నాను. లియో సినిమా కోసం పాటను కాపీ చేశాడా? లేదా? అనే విషయాన్ని పరిశీలిస్తున్నాం. అన్నీ విషయాలను పరిశీలించిన తర్వాత పూర్తిగా స్పందిస్తాను. ఇప్పుడు ఎవరిపై నేను ఆరోపణలు చేయడం లేదు అని ఒట్నికా తన పోస్టులో పేర్కొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X