twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bappi Lahari మరణానికి కారణం? అలాంటి వ్యాధి వల్లే కన్నుమూత.. వైద్యుల ధృవీకరణ

    |

    దేశ సినీ పరిశ్రమలో విభిన్నమైన, విలక్షణమైన సంగీతంతో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన మ్యూజిక్ లెజెండ్ బప్పీ లహరి ఇకలేరనే వార్త విషాదంలో ముంచెత్తింది. గత నెల రోజులుగా ముంబై క్రిటికేర్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న ఆయన ఫిబ్రవరి 14వ తేదీన డిశ్చార్జ్ అయ్యారనే వార్త అభిమానులను, సన్నిహితులను సంతోషానికి గురిచేసింది. డిశ్చార్జ్ అయిన మరుసటి రోజే ఆయన కన్నుమూయడంతో సంగీత ప్రపంచం మూగబోయింది. బప్పి లహరి మరణానికి సంబంధించిన వివరాల్లోకి, ఆయన వ్యక్తిగత జీవితంలోకి వెళితే..

    Recommended Video

    Bappi Lahiri The Disco King | India Remembers The Music Legend | Oneindia Telugu
     బప్పీ లహరి అసలు పేరు..

    బప్పీ లహరి అసలు పేరు..

    బప్పి లహిరి అసలు పేరు అలోకేష్. సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టే ముందు బప్పీలహరిగా మార్చుకొన్నారు. సినీ పరిశ్రమలో బప్పీ దా అంటూ అందరూ ముద్దుగా పిలుచుకొంటారు. సంప్రదాయకంగా సాగే సంగీతానికి తన డిస్కో మ్యూజిక్‌తో చెక్ పెట్టి బాలీవుడ్‌లో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎదిగాడు. డిస్కో డ్యాన్సర్ సినిమాతో ప్రపంచ సంగీత ప్రపంచంలో ఒకడిగా పేరు సంపాదించుకొన్నారు. డ్యాన్స్, డ్యాన్స్, చల్తే చల్తే, నమ్మక్ హలాల్, సాహెబ్ సినిమాలు ఆయన అగ్రస్థానానికి చేర్చాయి.

    టాలీవుడ్, బెంగాలీ సినీ పరిశ్రమలో

    టాలీవుడ్, బెంగాలీ సినీ పరిశ్రమలో

    బప్పీల హరి కేవలం హిందీ సినిమాకే పరిమితం కాలేదు. తెలుగు, బెంగాలీ సినీ పరిశ్రమలో తన ప్రతిభను చాటుకొన్నారు. తెలుగులో సింహాసనం, తేనే మనసులు, శంఖారావం, సమ్రాట్, ఇంద్రభవనం, స్టేట్ రౌడీ, గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు, బిగ్‌బాస్, రౌడీ గారి పెళ్లాం, డిస్కో రాజా లాంటి చిత్రాలకు సంగీతం అందించారు. చివరిసారిగా 2020లో భాగీ 3 చిత్రంలో బంకాస్ అనే పాటకు సంగీతం అందించారు.

    సల్మాన్ ఖాన్‌తో చివరి సారిగా

    సల్మాన్ ఖాన్‌తో చివరి సారిగా

    బాలీవుడ్‌లో షో మ్యాన్ అనే వ్యక్తుల్లో బప్పి లహిరి ఒకరు. విభిన్నమైన రూపంతో ఆకట్టుకోవడం ఆయన స్టైల్. ఖరీదైన డిజైనర్ దుస్తులు, మెడలో గోల్డ్ చైన్స్, బ్రాండెడ్ కళ్ల జోళ్లుతో స్టైలిష్‌గా కనిపించారు. ఆయన ఫ్యాషన్ ఇప్పటికీ ఓ ట్రెండింగ్‌గానే కనిపిస్తుంది. బాలీవుడ్‌లో ఫ్యాషన్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా కనిపిస్తారు. ఇలా భిన్న వ్యక్తిత్వం, ప్రతిభతో ఉండే.. బప్పి లహిరి చివరి సారిగా సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరించే బిగ్‌బాస్ 15లో కనిపించారు. తన మనవడు స్వస్తిక్ నటించిన బచ్చా పార్టీ ప్రమోషన్‌ను సల్మాన్ ఖాన్‌తో కలిసి చేశారు.

    కరోనావైరస్ కారణంగా

    కరోనావైరస్ కారణంగా


    అయితే గత సంవత్సర కాలంగా బప్పీ లహిరి పలు రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. గతేడాది కరోనావైరస్ బారిన పడిన తర్వాత ఆయనకు ఆరోగ్య సమస్యలు తీవ్రమయ్యాయి. దాంతో గత నెల నుంచి ముంబైలోని క్రిటికేర్ హాస్పిటల్‌లో చేరారు. అయితే ఆయన అబ్‌స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా (OSA) వ్యాధితో మరణించారని వైద్యులు ధృవీకరించారు.

    అబ్‌స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా అంటే ఏమిటి?

    అబ్‌స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా అంటే ఏమిటి?

    అబ్‌స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా వ్యాధి అంటే.. ఇదో రకమైన శ్వాస సంబంధిత వ్యాధి. నిద్రపోయే సమయంలో అనుకోకుండా శ్వాస ఆగిపోవడం, తిరిగి శ్వాస పుంజుకోవడం జరుగుతుంది. గొంతులో కొన్ని కండరాలు పనిచేయడం ఆగిపోతే.. శ్వాస తీసుకోవడం కష్టంగా మారుతుంది. దీని కారణంగా భారీగా గురక రావడం జరుగుతుంది. ఈ లక్షణాలు ఒక్కోసారి ప్రాణాలకు హానీగా మారుతాయి. ఇదే పరిస్థితి బప్పి లహిరికి ఎదురైందని క్రిటికేర్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ దీపక్ నామ్‌జోషి తెలిపారు.

    English summary
    Legendary music director Bappi Lahiri passed away. Dr Deepak Namjoshi, director of the hospital says that, He died due to OSA (obstructive sleep apnea) shortly before midnight.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X