Priyanka Chopra ప్రియాంక చోప్రా భర్త తీవ్ర అనారోగ్యం.. వింత జబ్బు అంటూ వీడియో
హీరోయిన్ ప్రియాంక చోప్రా భర్త ప్రమాదకరమైన ఇన్ఫ్లుఎంజా (ఎపిడెమిక్ వ్యాధి)తో బాధపడుతున్నాను. ఇప్పుడు నేను మ్యూజిక్ షోలో పాడలేను అంటూ ఓ వీడియోను పోస్ట్ చేశాడు. రాత్రి నుంచి షో కోసం ప్రాక్టీస్ చేస్తున్నాను. కానీ మళ్లీ నా పరిస్థితి విషమించింది. నేను నిన్న మొత్తం మంచం మీద నుంచి లేకలేకపోయా అంటూ తన అనారోగ్యం గురించి ప్రియాంక చోప్రా భర్త నిక్ జోనాస్ రిలీజ్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. మరి ఆయన ఏ జబ్బుతో బాధ పడుతున్నాడో మనం కూడా తెలుసుకుందాం.
జోనాస్ బ్రదర్స్ అమెరికాలో ఫేమస్ అన్న విషయం అందరికీ తెలిసిందే. బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా భర్త నిక్ జోనాస్ పాప్ బాయ్ బ్యాండ్ జోనాస్ బ్రదర్స్‌లో భాగం. అమెరికన్ సింగర్ నిక్, బాలీవుడ్ దేశీ గర్ల్ ప్రియాంక దంపతులు వారి కుమార్తె మాల్టీతో కలిసి అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో నివసిస్తున్నారు. ప్రస్తుతం ప్రియాంక చోప్రా భర్త అనారోగ్యంతో ఉన్నారు.

నిక్ జోనాస్ సోషల్ మీడియాలో స్వయంగా ఒక వీడియోను పంచుకున్నారు. దీంతో ప్రియాంక చోప్రా భర్తకు ఏమైందని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఈ వీడియోలో నిక్ తన అభిమానులకు క్షమాపణలు చెప్పాడు. షోను వాయిదా వేయడానికి గల కారణాన్ని కూడా జోనాస్ బ్రదర్స్ వెల్లడించారు. ఆ వీడియోలో నిక్ జోనాస్ బాగా జ్వరంతో ఉన్నట్లు కనిపిస్తున్నాడు. అనారోగ్యం కారణంగా స్టేజీపై నిలబడి షో ఇవ్వలేకపోతున్నానని నిక్ తెలిపాడు. జోనాస్ బ్రదర్స్ మ్యూజిక్ కాన్సర్ట్ తేదీని మార్చినట్లు నిక్ జోనాస్ ప్రకటించారు.

కానీ నా ఆరోగ్యం అంతగా బాగాలేదు. నేను నిన్న రోజంతా అనారోగ్యం కారణంగా మంచం మీద పడుకున్నాను. జ్వరం, చేతుల నొప్పి, గొంతునొప్పి, దగ్గు వంటి లక్షణాలు కనిపించాయి. ఇప్పట్లో కోలుకునే సూచనలు కనిపించడం లేదు. విశ్రాంతి అవసరమని డాక్టర్ కూడా చెప్పారని వీడియోలో నిక్ అభిమానులకు తన అనారోగ్యం గురించి చెప్పాడు. అదే వీడియోలో నేను ప్రమాదకరమైన ఇన్ఫ్లుఎంజా (ఎపిడెమిక్ వ్యాధి)తో బాధపడుతున్నాను. ఇప్పుడు నేను మ్యూజిక్ షోలో పాడలేను అని రాశాడు. అందుకే మెక్సికో కచేరీ తేదీని వాయిదా వేసుకున్నాను. మళ్ళీ ఆగస్టులో కాన్సర్ట్ నిర్వహిస్తామని చెప్పారు.
ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్న ఈ వీడియోను చూసిన వాళ్ళంతా ఆయన అనారోగ్యం నుంచి త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. మరోవైపు ప్రియాంక చోప్రా హాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇప్పటిదాకా బేవాచ్, ది మ్యాట్రిక్స్ రిసెరెక్షన్స్ వంటి సినిమాల్లో నటించి యాక్షన్ తో అదరగొట్టిన ప్రియాంక రీసెంట్ గా సిటాడెల్ అనే వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సిరీస్ ఆశించిన స్థాయిలో ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ అందుకోలేకపోయింది. ప్రస్తుతం ఈ బ్యూటీ సిటాడెల్ సీక్వెల్ తో పాటు ది బ్లఫ్ అనే మరో హాలీవుడ్ పీరియాడిక్ డ్రామాలో హీరోయిన్ గా నటిస్తోంది.


Click it and Unblock the Notifications











