Business: రాజాసాబ్ ఆడియోకి రికార్డు స్థాయి బిజినెస్.. ప్రభాస్ మూవీ రైట్స్ ఎన్ని కోట్లంటే?

Raja Saab Audio rights: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ హీరోగా, సక్సెస్ డైరెక్టర్ దర్శకుడు మారుతి కాంబోలో తెరకెక్కిస్తున్న చిత్రం 'ది రాజాసాబ్‌. 'కల్కి 2898 ఏడీ 'తో బడా హిట్‌ను కొట్టిన తరువాత వస్తున్న మూవీ కావడంతో ఈ మూవీపై అంచనాలు భారీగా పెరిగాయి. అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న రాజా సాబ్ మూవీ నుంచి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చేంది. ఇంతకీ ఆ మూవీ అప్డేట్ ఏంటో ఓ లూక్కేయండి.

వాస్తవానికి యంగ్ రెబల్ స్టార్ 'బాహుబ‌లి', 'బాహుబ‌లి-2' మూవీ తరువాత వ‌రుస ప్లాపుల‌తో స‌త‌మ‌త‌మయ్యారు. ఇటీవల వ‌రుస‌గా 'స‌లార్‌','క‌ల్కి 2898' వంటి బ్యాక్‌టుబ్యాక్ హిట్ అందుకుని స‌క్సెస్ ట్రాక్ ఎక్కారు. ఈ తరుణంలో హీరో ప్రభాస్ - డైరెక్ట‌ర్‌ మారుతి కాంబినేష‌న్‌లో రూపుదిద్దుకుంటున్న మూవీ 'ది రాజాసాబ్'. కామెడీ, హర్రర్ త్రిల్లర్ గా తెరకెక్కుతున్న మూవీ నుంచి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చేసింది. డార్లింగ్ పుట్టిన‌రోజు సందర్భంగా మూవీ మేకర్స్ స‌ర్‌ప్రైజ్ ప్లాన్ చేశారు. ఈ క్రమంలో సినిమా నుంచి ఓ క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చారు. డార్లింగ్ ప్రభాస్ సంబంధించిన మెస్మ‌రైజింగ్ లుక్‌ తో కుడిన ఓ స్పెష‌ల్‌ పోస్టర్ విడుద‌ల‌ చేశారు.

Is Raja Saab movie audio rights acquire T Series Company for Rs 25 crores

ఈ పోస్టర్ లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ గళ్ల చొక్కా, నల్ల కళ్లద్దాలు పెట్టుకుని స్టైల్‌గా నడుస్తూ కనిపించారు. ఇప్పటిదాకా ప్రభాస్ చేయని రొమాంటిక్ హారర్ జానర్ లో మూవీ రావడం, అదికూడా టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో "రాజా సాబ్" అనే మూవీ రావడంతో ఈ సినిమా మీద అందరిలోనూ క్యూరియాసిటీ ఏర్పడుతోంది.ఈ మూవీని తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీలో వచ్చే ఏడాది ఏప్రిల్ 10న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది.

కామెడీ, హర్రర్ త్రిల్లర్ తెరకెక్కనున్న ఈ మూవీలో ప్ర‌భాస్ స‌ర‌స‌న‌ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ మూవీకి ఎస్ఎస్ థ‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 10న 'రాజాసాబ్' ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ప్రభాస్ బర్త్డే నాడు (అక్టోబర్ 23న) మరో ట్రీట్ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడీ కొత్త‌ పోస్ట‌ర్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

Is Raja Saab movie audio rights acquire T Series Company for Rs 25 crores

ఇదిలా ఉంటే.. ఈ మూవీకి సంబంధించిన ఆడియో రైట్స్ ను ప్రముఖ ఆడియో సంస్థ T-Series చేసుకున్నట్టు తెలుస్తోంది. దాదాపు రూ. 25 కోట్లకు రాజాసాబ్ ఆడియో హక్కులను సొంతం చేసుకున్నట్టు సమాచారం. ఈ మూవీకి మ్యూజిక్ మాస్ట్రో థమన్ సంగీతం అందించారు. మాస్ అప్పీల్, కమర్షియల్ బీట్‌ల కలయికతో ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ సినిమా సౌండ్‌ట్రాక్‌ని రూపొందించినట్టు తెలుస్తోంది. టైటిల్ ట్రాక్ చార్ట్-టాపింగ్ హిట్ అవుతుందని, సినిమా విడుదలకు ముందే సంచలనం సృష్టిస్తుందని చిత్రనిర్మాతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

More from Filmibeat

Read more about: prabhas the raja saab maruthi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X