భార్యకు విడాకులు.. యంగ్ హీరోయిన్‌తో సింగర్ డేటింగ్
ఇండియన్ ర్యాప్ మ్యూజిక్ ప్రపంచంలో స్టార్ సింగర్‌గా పేరు సంపాదించుకొన్న బాద్షా వ్యక్తిగత, వైవాహిక జీవితం ప్రస్తుతం ముంబై మీడియాలో భారీ చర్చకు దారి తీసింది. ఇప్పటికే భార్యకు విడాకులు ఇచ్చిన ఈ టాప్ సింగ్ ప్రస్తుతం పంజాబీ నటితో డేటింగ్ చేస్తున్నట్టు సమాచారం. అయితే ఈ వ్యవహారంపై బాద్షా పెదవి విప్పడం లేదు. వీరిద్దరి సహజీవనం గురించిన వివరాల్లోకి వెళితే..

బాలీవుడ్‌లో టాప్ ర్యాపర్‌గా
ర్యాపర్ బాద్షా అసలు పేరు ఆదిత్య ప్రతీక్ సింగ్ సిసోడియా. హిందీ, పంజాబీ పాటలను రీమిక్స్ చేస్తూ తన ప్రతిభను చాటుకొన్నారు. అలాగే బాలీవుడ్‌లో పలు బ్లాక్‌బస్టర్ సినిమాల్లో పాటలు పాడి విశేషంగా అభిమానులను సంపాదించుకొన్నారు. వెండితెరపైనే కాకుండా బుల్లితెరపై కూడా రాణిస్తున్నాడు ఇండియా గాట్ టాలెంట్ రియాలిటీ షోకు జడ్జీగా కూడా వ్యవహరించాడు.

జాస్మిన్ ప్రేమించి పెళ్లి చేసుకొని..
బాద్షా తన కెరీర్ పీక్స్‌లో ఉండగానే.. జాస్మిన్ అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకొన్నాడు. వారిద్దరికి జెస్సీమీ గ్రేస్ మాసిహ్ సింగ్ అనే కూతురు ఉంది. కాపురం సవ్యంగా సాగుతుందని అనుకొంటుండగా.. భార్య జాస్మిన్‌తో అభిప్రాయబేధాలు తలెత్తాయి. దాంతో వారిద్దరి విడిపోవాలని నిర్ణయించుకొని రెండేళ్ల క్రితం విడాకులు తీసుకొన్నారు. ప్రస్తుతం బాద్సా మాజీ భార్య జాస్మిన్, కూతురు జెస్సీమీ లండన్‌లో స్థిరపడ్డారు.

పంజాబీ యాక్టర్ ఇషా రిఖీతో
భార్య జాస్మిన్‌తో విడాకులు తీసుకొన్న తర్వాత పంజాబీ యాక్టర్ ఇషా రిఖీతో ప్రేమలో పడ్డాడు. ఇషాను ఓ పార్టీలో కామన్ ఫ్రెండ్ ద్వారా కలుసుకొన్నారు. అక్కడ జరిగిన వారి పరిచయం ఇద్దరిని మరింత దగ్గరకు చేర్చించింది. ఆ తర్వాత పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారనే విషయాన్ని సన్నిహితులు వెల్లడిస్తున్నారు.

త్వరలోనే బాద్షా రెండో పెళ్లి
ప్రస్తుతం ఇషా, బాద్షా ఇద్దరు డేటింగ్ చేస్తున్నారు. అయితే రిలేషన్‌షిప్‌ను కొనసాగిస్తూ పెళ్లి చేసుకొనే ఆలోచనలో కూడా ఉన్నట్టు సమాచారం. గతేడాదిగా కొనసాగుతున్న ప్రేమ వ్యవహారం పాకన పడిందని, త్వరలోనే పెళ్లికి సిద్దమవుతున్నారనే విషయంపై పంజాబీ మ్యూజిక్ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

బాద్షా కెరీర్ విషయానికి వస్తే..
సింగర్, ర్యాపర్ బాద్షా కెరీర్ విషయానికి వస్తే. ఈ ఏడాది తబాహి, వూడూ, ట్రాప్ ముండే లాంటి ఆల్బమ్స్‌ను రిలీజ్ చేశారు. అలాగే ఏక్ విలన్ రిటర్స్ అనే చిత్రంలో అతిథి పాత్రలో కనిపించారు. అలాగే ధాకడ్ అనే సినిమాకు మ్యూజిక్ కూడా అందించారు. పలు ప్రాజెక్టులతో బాద్షా బిజీగా ఉన్నారు.


Click it and Unblock the Notifications











